వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జియాలో కొనసాగుతోన్న రీ కౌంటింగ్, మరో 4 గంటల్లో తేలనున్న ఫలితం..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకున్నది. మరో నాలుగు గంటల్లో ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నది. గత ఐదురోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడనున్నది. అయితే జార్జియాలో నువ్వా నేనా అన్నట్టు ట్రంప్-బిడెన్ మధ్య పోటీ ఉన్నది. దీంతో అక్కడ రీ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మరో 4 నుంచి 5 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నది.

 US Election Results: After slow count, Georgia says will hold a recount

4 వేల 169 ఓట్లు లెక్కించామని జార్జియా సెక్రటరీ బ్రాడ్ తెలిపారు. మరో 8 వేల మిలిటరీ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉందని వివరించారు. జార్జియాలో బిడెన్ 1096 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. విస్కాన్సిన్, మిచిగాన్‌లో బిడెన్‌కు మంచి పట్టు సాధించారు. జార్జియా, పెన్సిల్వేనియాలో కూడా ఓట్లు రావడంతో.. ఆయన విజయం ఖాయమవుతోంది. పెన్సిల్వేనియాలో 6 వేల ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కౌంట్ చేయని చాలా కౌంటీలో బిడెన్ లీడ్‌లో ఉంటారని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ట్రంప్ మద్దతుదారుల మాత్రం జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడ, అరిజోనాలలో బ్యాలెట్ గురించి అనుమానం వ్యక్తంచేశారు. ఇదే కాదు బ్యాలెట్ ఓట్ల గురించి తొలి నుంచి ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మద్దతుదారులకు ఏకంగా ఈ మెయిల్ చేశారు. ఇదీ అధికారికంగా రికార్డుల్లో ఉండనుంది.

English summary
US state of Georgia will hold a vote recount due to a razor-thin margin of votes between the two candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X