వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020: అందరి దృష్టి పెన్సిల్వేనియా , జార్జియా, ఆరిజోనాలపైనే .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అని ఇప్పటికే తేలిపోగా, డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో, ఆందోళనలతో యూఎస్ లో పలు ఉద్రిక్తతలు , నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 46వ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై అరిజోనా, జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా మరియు నెవాడా రాష్ట్రాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రాష్ట్రాలపైనే ఉంది.

అరిజోనా, పెన్సిల్వేనియా , నెవాడాలలో ఒక్కచోట గెలిచినా బైడెన్ దే అధ్యక్ష పీఠం

అరిజోనా, పెన్సిల్వేనియా , నెవాడాలలో ఒక్కచోట గెలిచినా బైడెన్ దే అధ్యక్ష పీఠం

అరిజోనా మరియు పెన్సిల్వేనియాలో ట్రంప్ మద్దతుదారుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాన్ని ప్రకటించడానికి అనేక రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక ఈ రాష్ట్రాల ఫలితాలు అధ్యక్ష పీఠం ఎవరిదో నిర్ణయించే అవకాశం ఉన్న కారణంగా అందరి దృష్టి ఈ రాష్ట్రాల కౌంటింగ్ పైనే ఉంది. అరిజోనా, పెన్సిల్వేనియా మరియు నెవాడాలలో ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో జో బైడెన్ గెలిచినా, వైట్ హౌస్ రేసులో ఆయన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఆ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆందోళనలు .. సర్వత్రా భయం

ఆ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆందోళనలు .. సర్వత్రా భయం

యూఎస్ ఎన్నికలలో కీలక భూమిక పోషించే రాష్ట్రాలు ఇంకా ఫలితాలను ప్రకటించనందున ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అనేక మంది శాసనసభ్యులు, పోల్ అధికారుల భద్రతపై భయం వ్యక్తం అవుతోంది. అరిజోనా విదేశాంగ కార్యదర్శి కేటీ హోబ్స్ నిరసనకారుల చర్యల వలన ఓట్ల గణన ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు . కౌంటింగ్ కు నిరసనకారులు అంతరాయం కలిగిస్తున్నారని , కౌంటింగ్ సిబ్బందిని తమ పని చేయకుండా నిరోధిస్తున్నారు అని హోబ్స్ అన్నారు.

ఆరిజోనాలో బైడెన్ గెలిచే ఛాన్స్ అన్న అసోసియేటెడ్ ప్రెస్ మరియు ఫాక్స్ న్యూస్

ఆరిజోనాలో బైడెన్ గెలిచే ఛాన్స్ అన్న అసోసియేటెడ్ ప్రెస్ మరియు ఫాక్స్ న్యూస్

నెవాడా క్లార్క్ కౌంటీ రిజిస్ట్రార్ జో గ్లోరియా ఒక నిరసనకారుడిచే ఇబ్బందికి గురి చేయబడ్డాడని, ఎప్పుడేం జరుగుతుందో ఆందోళన వ్యక్తం అవుతుందని పేర్కొన్నారు . అరిజోనా రాష్ట్ర అధికార అసోసియేటెడ్ ప్రెస్ యొక్క నివేదిక ప్రకారం, ఇంకా 2, 50,000 ఓట్లు లెక్కించబడలేదని చెప్పారు. అసోసియేటెడ్ ప్రెస్ మరియు ఫాక్స్ న్యూస్ జో బైడెన్ ఆరిజోనాలో గెలుస్తారని అంచనా వేసింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, బైడెన్ ప్రస్తుతం అరిజోనాలో 45,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు అందరి కళ్ళు మారికోపా కౌంటీపై ఉన్నాయి. అరిజోనాలో విజయం సాధిస్తే జో బైడెన్ అధ్యక్షుడిగా మారే అవకాశం ఉంది .

జార్జియాలో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో.. కొనసాగుతున్న సస్పెన్స్

జార్జియాలో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో.. కొనసాగుతున్న సస్పెన్స్

జార్జియాలో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో నమోదు అయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, డోనాల్డ్ ట్రంప్ 1,700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు, జో బైడెన్‌ కూడా సమీపంగానే రేసులో ఉన్నాడు. జార్జియా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఏడు కౌంటీలలో 18,936 మంది పోస్టల్ బ్యాలెట్లు ఇంకా లెక్కించబడలేదు. విదేశాలలో యుఎస్ ఆర్మీ అధికారుల బ్యాలెట్లను లెక్కించాల్సిన అవసరం ఉన్నందున శుక్రవారం సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగుతుందని జార్జియా అధికారులు తెలిపారు.

పెన్సిల్వేనియాలో పట్టు కోసం ట్రంప్ యత్నం

పెన్సిల్వేనియాలో పట్టు కోసం ట్రంప్ యత్నం

పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం శుక్రవారం సాయంత్రం నాటికి తగ్గే అవకాశం కనిపిస్తుంది . ఈ రాష్ట్రం ప్రారంభ రౌండ్ల లెక్కింపులో భారీ తేడాతో ట్రంప్ ఆధిక్యంలో ఉంది. పెన్సిల్వేనియాలో బైడెన్ 22,000 ఓట్ల వెనుకబడి ఉన్నాడు, మెయిల్-ఇన్ ఓట్లు ఇప్పటికీ లెక్కించబడుతున్నాయి. బ్లూ వాల్ ను పునర్నిర్మించే ప్రయత్నంలో బైడెన్ మరియు డెమొక్రాట్లు విస్కాన్సిన్, మిచిగాన్ మరియు పెన్సిల్వేనియా మూడు రాష్ట్రాలను తిరిగి పొందే ప్రయత్నంలో ఉన్నారు .

అధ్యక్ష పీఠం ఎవరికో నిర్ణయించే రాష్ట్రాలు కావటంతో ఆసక్తి

అధ్యక్ష పీఠం ఎవరికో నిర్ణయించే రాష్ట్రాలు కావటంతో ఆసక్తి

ట్రంప్ ఈ మూడు రాష్ట్రాలలో 2016 లో ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఇప్పుడు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఎన్నికల అధికారులు కూడా తమ వద్ద 1,700 బ్యాలెట్లు ఉన్నాయని, వాటిని లెక్కింపు కోసం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, చాలా వరకు బ్యాలెట్లను శుక్రవారం సాయంత్రం నాటికి లెక్కించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ రాష్ట్రాలు అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో నిర్ణయించే రాష్ట్రాలు కావటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రాష్ట్రాలపైనే ఉంది.

English summary
Arizona, Georgia, Pennsylvania, North Carolina and Nevada will play a decisive role on President of the US. All eyes remain on Arizona, Pennsylvania and Nevada as a win in any of these three states for Joe Biden would bring him as president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X