• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డులపై బిడెన్ హామీ - చైనాతో పోరులో భారత్‌కు సహకారం - కమలతో కలిసి ప్రసంగం

|

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులే కేంద్రంగా ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ ట్రంప్ ఏలుబడిలో విదేశీ నిపుణుల రాకపై అనేక ఆంక్షలు అమలవుతున్నవేళ.. దేశాధ్యక్షుడిగా తాను గెలిస్తే, హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ హామీ ఇచ్చారు. ట్రంప్ అమలు చేస్తోన్న దేశాల వారీ వీసా కోటాల విధానాన్ని రద్దు చేస్తానని, తద్వారా ఇండియన్లకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ''సౌత్ ఏషియా ఫర్ బిడెన్'' ఈవెంట్ లో ఆయన కీలక ప్రసంగం చేశారు. కుటుంబ ఆధారిత వలస విధానాన్ని తిరిగి ప్రోత్సహిస్తామని, కుటుంబ ఏకీకరణకు మద్దతిస్తామని, శాశ్వత వీసాల కోటాను గణనీయంగా పెంచుతామని బిడెన్ హామీ ఇచ్చారు. 2016లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో గెలిచిన ట్రంప్.. అక్కడి ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కేలా హెచ్-1బీ వీసా, వర్క్ పర్మిట్ల నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.

1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..

us elections 2020: Biden says will stand with India, key statement on H1B visa, green cards

ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆసియా, ఆఫ్రియా మూలాలున్న కమలా హ్యారిస్ ను ఎంచుకున్న జో బిడెన్... ఎన్నికల్లో తాము గెలిస్తే భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు. చైనా పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ''ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రాంతీయ, సరిహద్దు సవాళ్లను ఎదుర్కోవడంలో మేం వెన్నుదన్నుగా నిలుస్తాం''అని భరోసా ఇచ్చారు. ఇండియా, అమెరికా బంధంతో ప్రపంచం సేఫ్ గా ఉండగలదని, 15 ఏళ్ల కిందట రెండు దేశాల మధ్య జరిగిన అణు ఒప్పందంలో తానది కీలక పాత్ర అని బిడెన్ గుర్తుచేశారు.

అమెరికాలో దాదాపు 13 లక్షలుగా ఉన్న ఇండియన్ అమెరికన్లను ఆకట్టుకునేలా.. ప్రత్యేక పాలసీ డాక్యుమెంట్ ను కూడా బిడెన్ తయారుచేశారని, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చేసే గ్రాడ్యుయేట్లు, స్టెమ్ ఫీల్డ్ లో పనిచేసే వారిపై ఉన్న వీసాల పరిమితిని కూడా తొలగించే ఆలోచనలో ఆయన ఉన్నారని డెమోక్రాట్ క్యాంపెయిన్లు చెబుతున్నారు. బిడెన్ టీమ్ లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉండటం గమనార్హం.

ట్రంప్ కుటుంబంలో విషాదం - డొనాల్డ్ తమ్ముడు రాబర్డ్ మృతి - ప్రెసిడెంట్ భావోద్వేగం..ట్రంప్ కుటుంబంలో విషాదం - డొనాల్డ్ తమ్ముడు రాబర్డ్ మృతి - ప్రెసిడెంట్ భావోద్వేగం..

us elections 2020: Biden says will stand with India, key statement on H1B visa, green cards
  TikTok Need to Find US Based Owner or it Will be Forced to Shut operations : Trump || Oneindia

  గత ఒబామా హయాంలో తాను ఉపాధ్యక్షుడిగా.. అమెరికా చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భారత సంతతి వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించామని జో బిడెన్ చెప్పుకొచ్చారు. తొలిసారిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. ఈసారి కూడా భారతీయులకు ప్రాధాన్యం దక్కేలా విధానాలు రూపొందిస్తామని చెప్పారు.

  English summary
  Joe Biden, the presumptive Democratic nominee for president, on Saturday pledged closer ties with India and a better deal for Indian Americans in a short, policy-laden Independence Day message. He will stand with India in confronting “new threats its faces in its own region and along its own border”, he said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X