వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో మోదీ హల్‌చల్ - ట్రంప్ తొలి ప్రచారంలో హైలైట్ - కమలపై కమలం రుసరుస

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా మారారు. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి ప్రచార వీడియోలో ఆయనే హైలైట్ గా నిలిచారు. గతేడాది హ్యూస్టన్ లో జరిగిన 'హౌడీ మోదీ', ఈఏడాది ప్రారంభంలో అహ్మదాబాద్ లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమాల క్లిప్పులతోనే ట్రంప్ క్యాంపెయిన్ తన పని ప్రారంభించడం గమనార్హం. గెలుపోటములను ప్రభావితం చేసే ఇండియన్ అమెరికన్ ఓటర్ల నాడిపై వెలువడిన సర్వేలు, డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ పై బీజేపీ వర్గాలు చేస్తోన్న కామెంట్లు ఎన్నికలను మరింత సరవత్తరంగా మార్చాయి..

Recommended Video

US Election 2020 : Donald Trump Campaign Releases Commercial Featuring PM Modi || Oneindia Telugu

జగన్ వికృత క్రీడకు 85 మంది బలి - పైసా లేకుండా పాలనన్న టీడీపీ - విజయసాయిరెడ్డి మళ్లీ వేశారుజగన్ వికృత క్రీడకు 85 మంది బలి - పైసా లేకుండా పాలనన్న టీడీపీ - విజయసాయిరెడ్డి మళ్లీ వేశారు

మరో నాలుగేళ్లంటూ..

మరో నాలుగేళ్లంటూ..

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడుతోన్న సంగతి తెలిసిందే. ట్రంప్ క్యాంపెయిన్ కు సారధ్యం వహిస్తోన్న జూనియర్ ట్రంప్, కింబర్లీ గుయిల్‌ఫోయెల్ ఆదివారం తొలి ప్రచార వీడియోను విడుదల చేశారు. ‘‘ఫోర్ మోర్ ఇయర్స్''పేరుతో రూపొందిన ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖంగా చూపించారు. హ్యూస్టన్ వేదికపైనుంచి ట్రంప్ ను ఉద్దేశించి మోదీ అన్న మాటలు, అహ్మదాబాద్ లో మోదీ, ఇండియాపై ట్రంప్ చేసిన కామెంట్లను కూర్చి ఈ వీడియోను రూపొందించారు.

ఇండియన్ అమెరికన్లలో జోష్..

ఇండియన్ అమెరికన్లలో జోష్..

నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 25 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఓటింగ్ కు అర్హత సాధించారు. దీంతో రెండు పార్టీలూ మనోళ్ల ఓట్లపై ఫోకస్ పెంచాయి. గణేశ్ చతుర్థి సందర్భంగా డెమోక్రాట్ అభ్యర్తి జోబైడెన్ భారతీయులకు శుభాకాంక్షలు చెప్పగా, ఆ మరుసటి రోజే ట్రంప్ క్యాంపెయిన్ ఏకంగా మోదీతో కూడిన వీడియోను విడుదల చేసింది. ‘‘ఇండియాతో సంబంధాలను అమెరికా బాగా ఎంజాయ్ చేస్తుంది. అలాగే, మేం రూపొందించిన ప్రచార వీడియో సైతం ఇండియన్ అమెరికన్లలో జోష్ నింపింది''అని కింబర్లీ వ్యాఖ్యానించారు.

అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..

మనోళ్ల మూడ్ మారుతోందట..

మనోళ్ల మూడ్ మారుతోందట..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లను ఆకర్షించేందుకు రెండు పార్టీలూ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నవేళ ప్రఖ్యాత సర్వే సంస్థ ‘మాసన్' ఓ నివేదికను విడుదల చేసింది. అమెరికాలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరుపొందిన రిపబ్లికన్ పార్టీలో శ్వేతజాతీయులదే ఆధిక్యంకాగా, డెమోక్రటిక్ పార్టీ వసలదారులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. చరిత్ర పొడవునా భారతీయ అమెరికన్లు డెమోక్రాట్లవైపే మొగ్గుచూపుతూ వచ్చారు. అయితే, మోదీతో ట్రంప్ బలమైన స్నేహబంధం కొనసాగిస్తున్న కారణంగా అక్కడి భారత సంతతి ప్రజల ఆలోచనా సరళిలో మార్పులు వచ్చాయని, దీంతో చాలా మంది రిపబ్లికన్ పార్టీవైపునకు మొగ్గుచూపుతున్నారని ‘మాసన్ సర్వే' పేర్కొంది. అదీగాక..

కమలకు మోదీ మద్దతు లేనట్లేనా?

కమలకు మోదీ మద్దతు లేనట్లేనా?

ఆఫ్రికన్ అమెరికన్, ఇండియన్ అమెరికన్ సహా అన్ని వలసదారులందరినీ ఆకట్టుకునేలా డెమోక్రటిక్ పార్టీ ఈసారి ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను నిలబెట్టింది. ఇండియా తల్లి, జమైకన్ తండ్రికి జన్మించిన కమల ఇప్పటికే తన ప్రచారంలో వలసదారులకు కల్పించే భద్రతపై అనేక హామీలు ఇస్తుననారు. అయితే, ఇండియాలోని అధికార బీజేపీ వర్గాలు మాత్రం కమలపై నెగటివ్ ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును కమల బాహాటంగా వ్యతిరేకించడం, భారత్ లో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రచారాలను ఆమె సమర్థించడం తదితర కారణాలను చూపుతూ ఆమెకు భారతీయ అమెరికన్లు సహకించబోరనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ‘‘ఫిర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్'' అని మోదీ ఇదివరకే స్పష్టం చేశారని, కమలకు ఆయన మద్దతు ఉండబోదని బీజేపీ అనుబంధ సోషల్ మీడియా వేదికలపై కామెంట్లు వినిపిస్తున్నాయి.

English summary
Aiming to woo the influential Indian-American voters numbering over 2 million, the Trump campaign has released its first video commercial that has short clips from Prime Minister Narendra Modi's speeches and United States President Donald Trump's historic address in Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X