వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు . అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని రియాలిటీ షో చేశారని యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా , డోనాల్డ్ ట్రంప్ పై మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాలనలో ట్రంప్ తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అందరి దృష్టిని ఆకర్షించాలన్న కోరికతో ట్రంప్ రియాలిటీ షో చేస్తున్నారంటూ మండిపడ్డారు.

US elections 2020: అమెరికా అధ్యక్ష పోరులో నువ్వా నేనా .. తేల్చుకోనున్న ట్రంప్ , జో బైడెన్ US elections 2020: అమెరికా అధ్యక్ష పోరులో నువ్వా నేనా .. తేల్చుకోనున్న ట్రంప్ , జో బైడెన్

కరోనా విపత్తు కాలంలో భారీ బహిరంగ సభలు పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ సభల కారణంగా జరుగుతున్న పరిణామాలను మనం అనుభవిస్తున్నామని పేర్కొన్న బరాక్ ఒబామా, ట్రంప్ ప్రత్యర్థిగా బరిలోకి దిగిన జో బైడెన్ మాత్రమే కరోనా కష్ట కాలం నుండి ప్రజలను బయటకు తీసుకు రాగలరని బైడెన్ కు మద్దతు పలికారు.

US elections 2020: Obama supports joe biden and slams Trump for treating presidency like a reality show

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జో బైడెన్ ప్రజలకు సూచిస్తున్నారు అని చెప్పిన బరాక్ ఒబామా కరోనా మహమ్మారి కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి అంటే బైడెన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs బిడెన్.. ఆ స్టేట్ లో ఎవరు గెలుస్తారో వారిదే అధ్యక్ష పదవి! || Oneindia

ఒబామా రెండు పర్యాయాలు యూఎస్ ను పరిపాలించారు . డెమొక్రాటిక్ పార్టీలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో బరాక్ ఒబామా ఒకరు. కరోనా మహమ్మారి విషయంలో యూఎస్ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, డోనాల్డ్ ట్రంప్ కరోనాను నివారించటంలో ఫెయిల్ అయ్యారని నిరాశతో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారి తనకు మైనస్ గా మారుతుందని భావిస్తుండటంతో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చివరిరోజున కోవిడ్19 ను ఎదుర్కోవటానికి ఆర్థిక పునరుజ్జీవనం మరియు వ్యాక్సిన్‌ను వాగ్దానం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఎంత చేసినా, ఎంత గట్టిగా ప్రత్యర్థి పై మాటల దాడి చేసినా జో బైడెన్ కు మద్దతు పెరుగుతోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం జో బైడెన్ కు అండగా నిలిచి డెమోక్రాట్ లకు ఓటెయ్యాలని పిలుపునిస్తున్నారు.

English summary
Former US President Barack Obama fires on US President Donald Trump for his handling of the coronavirus pandemic, and his conduct in the Oval Office, saying, he is treating the presidency as "a reality show to give him the attention that he craves."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X