వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020: ఎన్నికల సమయంలో ట్రంప్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు .. తీర్పుపై ట్రంప్ అసహనం

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ కొనసాగుతున్న సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. ఈరోజు అమెరికా పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతుందనగా సుప్రీంకోర్టు డోనాల్డ్ ట్రంప్ కు పెద్ద షాక్ ఇచ్చింది. మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ , మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న, ఆ విధానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అసహనానికి గురి చేసింది.

పోలింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్ లు లెక్కింపు .. కానీ కండీషన్

పోలింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్ లు లెక్కింపు .. కానీ కండీషన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా భావించే ముఖ్య రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో ఈమెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లపై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. ఎన్నికల పోలింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు చేరినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ ఓట్లు బ్యాలెట్ పోస్ట్ కవర్ల పై నవంబర్ 3వ తేదీ అని మాత్రమే ఉండాలని, నవంబర్ 3 తర్వాత పోస్ట్ చేసినవి చెల్లుబాటు కావని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. అంటే పోలింగ్ రోజున కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్ ల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.

పోస్ట్ కవర్ పై ఉన్న తేదీని బట్టి ఓట్లు చెల్లుబాటు అవుతాయా లేదా నిర్ణయం

పోస్ట్ కవర్ పై ఉన్న తేదీని బట్టి ఓట్లు చెల్లుబాటు అవుతాయా లేదా నిర్ణయం

పోస్ట్ కవర్ పై ఉన్న తేదీని బట్టి ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయా లేదా అనేది కౌంటింగ్ సిబ్బంది నిర్ణయిస్తారని సుప్రీం ధర్మాసనం తేల్చింది.

ఎన్నికలకు కొద్ది గంటల ముందు కోర్టు వెల్లడించిన ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు . పెన్సిల్వేనియాలో మెయిల్ ఇన్ ఓటింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నికల విధానానికి తీవ్ర ప్రమాదకరమని ట్రంప్ అంటున్నారు. కోర్టు ఇచ్చిన ఈ వెసులుబాటు తో మోసాలు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

US Election 2020 : Electoral College Is Key Factor,All you Need to Know| #USpresidentialpolls
సుప్రీం నిర్ణయంపై ట్రంప్ అసహనం .. సోషల్ మీడియాలో పోస్ట్

సుప్రీం నిర్ణయంపై ట్రంప్ అసహనం .. సోషల్ మీడియాలో పోస్ట్


సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్దమైన వ్యవస్థను బలహీన పరిచే విధంగా ఉందని, అత్యంత బాధాకరమని ట్రంప్ పేర్కొన్నారు. సుప్రీం నిర్ణయం అల్లర్లను హింసను ప్రేరేపిస్తుంది అంటూ, ఏదో ఒకటి చేయాల్సిందే అంటూ ట్రంప్ తన అధికారిక ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ ఖాతాలలో పోస్ట్ చేశారు. మొత్తానికి ప్రస్తుతం ఎన్నికల సరళి డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేక గాలిని వీస్తుండగా, సుప్రీం నిర్ణయం సైతం డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చింది.

ఇక ఎన్నికల్లో ఓటమి పాలైతే ట్రంప్ న్యాయ పోరాటం చెయ్యాలని కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ట్రంప్ .

English summary
The Supreme Court has revealed a key ruling on email in ballot votes in Pennsylvania, one of the key states in the U.S. presidential election. The Supreme Court has ruled that even if mail-in ballot votes are received three days after polling, they should be considered, but those votes should only be on November 3 on the ballot post covers, and those posted after November 3 are invalid. This means that voters will be able to exercise their voting right through mail-in ballots even on polling day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X