వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020: వక్రమార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించుకుంటావా .. జో బైడెన్ పై ట్రంప్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

ఓ వైపు చారిత్రాత్మక విజయానికి డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేరువవుతున్న సమయంలో ట్రంప్ విజయావకాశాలు అంతకంతకూ తగ్గుతున్నాయి . ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని , సమయం గడిచినా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్వీకరిస్తున్నారని ఆరోపిస్తూ తాజా ఫలితాలపై కోర్టుకు వెళ్తానని పదే పదే చెప్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రత్యర్ధి జో బైడెన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

US elections 2020: అందరి దృష్టి పెన్సిల్వేనియా , జార్జియా, ఆరిజోనాలపైనే .. ఎందుకంటేUS elections 2020: అందరి దృష్టి పెన్సిల్వేనియా , జార్జియా, ఆరిజోనాలపైనే .. ఎందుకంటే

ప్రజాస్వామ్య రాజ్యం లో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనుకోవద్దు

ప్రజాస్వామ్య రాజ్యం లో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనుకోవద్దు

ప్రజాస్వామ్య రాజ్యం లో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని అనుకోవద్దు అంటూ ఆరోపించారు. బైడెన్ తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించు కోకూడదు . అలా నేను చేయగలను. ఇప్పుడే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ఎన్నికలలో ఓటమికి చేరువవుతున్న నేపధ్యంలో జో బైడెన్ ను కించపరిచే తన తాజా ప్రయత్నంలో, అధ్యక్ష పదవిని "తప్పుగా" ప్రకటించటానికి ప్రయత్నం జరుగుతోంది అంటూ ఛాలెంజర్ జో బైడెన్‌ను హెచ్చరించారు.

 కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్ ను వెనక్కు నెట్టిన జో బైడెన్

కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్ ను వెనక్కు నెట్టిన జో బైడెన్

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది . ముందు నుంచి జార్జియా, పెన్సిల్వేనియాలోఆధిక్యంలో ఉన్న ట్రంప్ ఇప్పుడు జో బైడెన్ కంటే వెనక్కు వెళ్ళిపోయారు. బైడెన్ విజయానికి చేరువ అవుతుండగా, డోనాల్డ్ ట్రంప్ ఓటమి అంచులకు చేరుకుంటున్నారు. పెన్సిల్వేనియా జార్జియా , నెవడా లలో ఏ ఒక్క చోట విజయం సాధించిన జో బైడెన్ కు అధ్యక్ష పీఠం దక్కినట్టే. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట గెలుపొందిన బైడెన్ అధ్యక్షుడిగా అధికారం దక్కించుకుంటారు .

 విజయావకాశం లేక జో బైడెన్ పై విరుచుకుపడుతున్న ట్రంప్

విజయావకాశం లేక జో బైడెన్ పై విరుచుకుపడుతున్న ట్రంప్

ప్రస్తుతం జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకోగా, డోనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. విజయావకాశాలు ఏమాత్రం లేకపోవడంతో డోనాల్డ్ ట్రంప్ మాటల దాడికి దిగారు.

డెమొక్రాట్ జో బైడెన్ వైట్ హౌస్ పీఠం దక్కించుకోటానికి చేరువగా ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల సమరంలో కీలక రాష్ట్రాలలోనూ తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారు , కాని అధికారులు ఓట్లను లెక్కించడం ఇంకా కొనసాగించడంతో విజేతగా ప్రకటించకుండా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది .

English summary
US President Donald Trump, in his latest effort to discredit vote tallies showing him headed for defeat in the tense US election, warned challenger Joe Biden on Friday against "wrongfully" claiming the presidency.In his latest broadside, he warned on Twitter that "Joe Biden should not wrongfully claim the office of the President. I could make that claim also. Legal proceedings are just now beginning!"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X