వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లోని అమెరికా ఎంబసీల్లో వీసా అప్లికేషన్లు - హెచ్1బీ, ఎల్1 రెన్యూవల్స్‌కూ అవకాశం

|
Google Oneindia TeluguNews

డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇమిగ్రేషన్లపై నిషేధాజ్ఞలు విధించిన దరిమిలా, భారతీయులకు కొంత ఊరట కలిస్తూ ఇండియాలోని అమెరికన్ ఎంబసీలు శుక్రవారం కీలక ప్రకటన చేశాయి. త్వరలోనే డ్రాప్ బాక్స్ అప్లికేషన్లు స్వీకరిస్తామని, ఆ ప్రక్రియలోనే హెచ్ 1బీ, ఎల్1 వీసాల రెన్యూవల్స్ కు కూడా అవకాశం కల్పిస్తామని పేర్కొన్నాయి. పాత సంస్థలో అదే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోబోయేవారికి ఈ ప్రకటన ఉపశమనంలా మారింది.

ఇండియాలోని అమెరికన్ ఎంబసీల తరఫున శుక్రవారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. సవరించిన ఉత్తర్వులకు అనుగుణంగా.. కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్లతోపాటు అమెరికాలో ఇంతకు ముందు అదే సంస్థలో అదే ఉద్యోగంలో కొనసాగేందుకు హెచ్ -1 బి వీసాదారులు, ఎల్ -1 వీసాదారుల రెన్యూవల్స్ ను కూడా చేపడతారు.

us-embassies-to-accept-visa-applications-for-certain-categories-including-h-1b-renewals

జూన్ 22 నాటి ప్రకటనలో.. ఈ ఏడాది చివరి వరకు , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 చివరి వరకు సస్పెన్షన్‌ను పొడిగించారు, హెచ్ -1 బి రకంతో సహా వర్క్ వీసాలు 525,000 మందికి పైగా అధిక నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించాయి.

హెచ్ 1బీ సహా వర్క్ వీసాలున్న 5.25లక్షల మంది విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై నిషేధం విధిస్టున్నట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూన్ 22న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించాలన్న ఉద్దేశంతోనే ప్రెసిడెంట్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌజ్ వివరించింది. తాజా ప్రకటనతో ఒకింత ఊరట లభించినట్లయింది.

English summary
United States embassies in India will soon be accepting drop box applications for certain visa categories, including renewals for H1-B and L-1 visas which falls under the list of immigration ban announced by the Trump administration in June. This comes after as relief to people who will be applying for the same role in the same organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X