వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిర్ణయంతో సవాలే: భారత ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎఫెక్ట్ రెండు రెట్లు

ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పును అదుపులో పెట్టేందుకు 2015లో జరిగిన పారిస్ సదస్సు నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఆర్థిక,

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పును అదుపులో పెట్టేందుకు 2015లో జరిగిన పారిస్ సదస్సు నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది. కనీసం రెండు రెట్ల ప్రభావం ఉంటుంది. చైనా, అమెరికా తర్వాత అత్యధికం కాలుష్యం వెదజల్లుతున్న దేశంగా భారత్ ఉన్నా.. పారిస్ ఒప్పందం ప్రకారం కాలుష్య నియంత్రణకు ఇప్పటికిప్పుడు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ఈ దిశగా చిన్న చిన్న మార్పుల కోసం భారీగా ఖర్చు చేయాలి. ఈ తరుణంలో పారిస్ వాతావరణ మార్పు సదస్సు తీర్మాణం అమలులో భారత్, చైనాలకు ఎటువంటి జవాబుదారీతనం లేదని అమెరికా పేర్కొన్నది. పారిస్‌ ఒప్పందం ప్రకారం అమెరికాలోనూ 26 నుంచి 28 శాతం మేరకు గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనికి లక్షల కోట్ల డాలర్లు అమెరికా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

లక్షల కోట్ల డాలర్ల ఖర్చే అమెరికాకు ఇబ్బంది

లక్షల కోట్ల డాలర్ల ఖర్చే అమెరికాకు ఇబ్బంది

ప్రస్తుత పారిస్‌ ఒప్పందం వల్ల 2030 వరకు చైనా ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌కు వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందించాల్సి ఉంటుంది. పారిస్ ఒప్పందం రష్యాకు గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు వెదజల్లేవిధంగా రాయితీ కల్పించింది. పారిస్ సదస్సు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, దాని నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అధికారి స్కాట్‌ప్రుయిట్‌ సమర్థించారు. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్నారు. కానీ క్లైమేట్ చేంజ్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించనుండటం గమనార్హం.

పరస్పర విశ్వాసమే ఇలా ప్రధానం

పరస్పర విశ్వాసమే ఇలా ప్రధానం

భారత్ - అమెరికా మధ్య గల ద్వైపాక్షిక సంబంధాల్లో మంచి, చెడు ఉన్నట్లే పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్న ట్రంప్ తీసుకున్నట్లు తీసుకున్న నిర్ణయం కీలకం కాదు. విభేదాలు ఉన్నా రెండు దేశాల మధ్య ‘మాంట్రియల్ ప్రొటోకాల్ పరిధిలో పారిస్, అంతర్జాతీయ పౌర విమాన యాన సంస్థ నుంచి కర్బన ఉద్గారాల నియంత్రణ'కు భూవాతావరణ మార్పు నివారణకు ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షికంగా ఇరు దేశాల మధ్య పరస్పరం ఇంధనం పొందేందుకు పలు ద్వైపాక్షిక ఒప్పందాలు అమలులో ఉన్నాయి. ఇంధన పరిష్కార మార్గాల కోసం పరిశోధన, అభివ్రుద్ధి రంగాల్లో రెండు దేశాలు సంయుక్తంగా భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అమెరికా తాజా నిర్ణయం వల్ల తక్షణం ద్వైపాక్షిక ఇంధన కార్యక్రమాలు, సంయుక్త పెట్టుబడులు, పెట్టుబడిదారుల విశ్వాసంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదని ఆచరణలో గానీ తేలనున్నది.

అణు విద్యుత్ కోసం భారత్ ఇలా

అణు విద్యుత్ కోసం భారత్ ఇలా

రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘ కాలిక కాంట్రాక్టులపై ఇంధన ధరలు ఆధారపడి ఉన్నాయి. అమెరికాలోని రెండు టర్మినల్స్ నుంచి ఏడాదికి 5.8 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) లిక్విడ్ నేచురల్ గ్యాస్‌ను, కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ‘గెయిల్' కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కంటే అధిక ధర పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నది. 2020 నాటికి భారత్ 50 ఎంఎంటీపీఎల గ్యాస్ దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఒకవేళ ధర ఖరారైనట్లు భావిస్తే అమెరికా నుంచి అదనపు ఎల్ఎన్‌జీ గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు 88 శాతం అధిక ధరకు భారత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు అణు విద్యుత్ ఉత్పత్తి పెంపొందించేందుకు 7000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల 10 స్వదేశీ రియాక్టర్ల నిర్మాణానికి సంకేతాలిచ్చింది.

ప్రగతి కోసం కర్బన ఉద్గారాల తగ్గింపు తప్పనిసరి

ప్రగతి కోసం కర్బన ఉద్గారాల తగ్గింపు తప్పనిసరి

ఈ నెలలో ఆరు వెస్టింగ్ హౌస్ రియాక్టర్ల కొనుగోలుకు కాంట్రాక్ట్ ఖరారు కావాల్సి ఉన్నా, దివాళా తీసిన వెస్టింగ్ హౌస్‌ను మరొక సంస్థ కొనుగోలు చేసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కాలుష్య రహిత ఇంధన వనరులైన గ్యాస్, అణు విద్యుత్ రెండు దేశాలకు లబ్ది చేకూర్చనున్నాయి. ఇంధన ఎగుమతి దారులు, టెక్నాలజీ ప్రొవైడర్లతో ఇంధన ఉత్పత్తిలో వ్యయం తగ్గనున్నది. ఇంధన సామర్థ్యం భారీగా టెక్నాలజీకల్, వాణిజ్య అవకాశాలను కల్పిస్తోంది. ఒకవేళ అత్యధిక ఆర్థిక వ్రుద్ధి రేటు సాధించాలంటే గణనీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. పారిశ్రామిక, రవాణా, నిర్మాణ రంగాల్లో ఇంధన సామర్థ్యం కీలకం కానున్నది.

ప్రత్యామ్నాయ మార్కెట్‌లో అవకాశాలిలా

ప్రత్యామ్నాయ మార్కెట్‌లో అవకాశాలిలా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీస్థాయిలో పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తిగా సమర్థవంతమైన ఇంధన సామర్థ్య పథకాల కింద కొనసాగుతున్నాయి. అయితే 200 పారిశ్రామిక కస్టర్ల పరిధిలో30 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 14 - 15 శాతం మాత్రమే పారిశ్రామిక ఇంధన వినియోగం కలిగి ఉన్నాయి. వచ్చే రెండు దశాబ్దాల్లో భారతదేశంలో శీతల వసతులు ఐదురెట్లు పెరగాల్సి ఉన్నది. మూడోతరం బయో ఇంధనం, విద్యుత్ వాహనాల రవాణాకు అవసరమైన బ్యాటరీల మార్కెట్ విస్తరించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం మార్కెట్‌లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.

గ్రిడ్ సుస్థిరత, సైబర్ సెక్యూరిటీ కోసం ఇలా

గ్రిడ్ సుస్థిరత, సైబర్ సెక్యూరిటీ కోసం ఇలా

రెండు దేశాల మధ్య ఇంధన భద్రత కూడా కీలకమే. ఇంధన సరఫరాలో భద్రత కల్పిస్తూ హిందూ మహా సముద్రం పరిధిలో భారత్, అమెరికా మధ్య సముద్ర జలాల మధ్య భద్రతా సహకారం కోసం చర్చలు జరుపాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్ గ్రిడ్ పై సైబర్ దాడులను నియంత్రిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉన్నది. భారత గ్రిడ్ పరివర్తన దిశగా సంయుక్త కార్యక్రమం అమలులో ఉన్నది. టెక్నాలజీ మార్పిడి, ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రిడ్ సుస్థిరత, సైబర్ సెక్యూరిటీకి సహకారం అందించాల్సి ఉంటుంది.

భారత్ రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాలివి

భారత్ రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాలివి

సంప్రదాయేతర ఇంధనం తయారీ దిశగా అమెరికా సమాఖ్య విధానాల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. దీంతోపోలిస్తే భారత్ సంప్రదాయేతర ఇంధన మార్కెట్ ఆకర్షణీయంగా ఉన్నది. 2022 నాటికి 175 గిగా వాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా భారత్ పెట్టుకున్నది. కానీ దీర్ఘ కాలిక విధానాల ఆపర్లు, పెట్టుబడి అవకాశాల్లో విశ్వసనీయతే ఇబ్బందికరంగా మారింది. భారతదేశంలో 2015, 2016ల్లో సుమారు 10 బిలియన్ల డాలర్ల పెట్టుబడుల పెట్టాయి. గతేడాది 1.9 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు విడుదల చేశారు. భారత సౌర విద్యుత్ ఉత్పాదక లక్షాల సాధనకు 100 బిలియన్ల డాలర్ల రుణం అవసరం. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఉత్పాదక సంస్థలకు భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.

English summary
While Donald Trump’s announcement of the US pull out of the Paris climate agreement is unfortunate, there are many other ways for India and the US to collaborate on the energy front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X