వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాపై కొత్త పిడుగు: మున్ముందు గడ్డు కాలం: 3 లక్షలమంది బలి?: వాషింగ్టన్ వర్శిటీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న అగ్రరాజ్యం అమెరికాలో మున్ముందు మరిన్ని భయానక పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే అయిదారు నెలల్లో అమెరికా మరిన్ని దుర్భర పరిస్థితులను చవి చూడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న రోజుల్లో అమెరికా మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 50 లక్షలను దాటిన కేసులతో అల్లాడుతోన్న అమెరికాలో మరణాల సంఖ్య కూడా అదే రేంజ్‌లో నమోదవుతాయనే ఆందోళనలు ఉన్నాయి.

కరోనా కొత్త రికార్డు: దిమ్మ తిరిగేలా: ఒక్కరోజే 62 వేలకు పైగా: 20 లక్షలను దాటి: భయానకంగాకరోనా కొత్త రికార్డు: దిమ్మ తిరిగేలా: ఒక్కరోజే 62 వేలకు పైగా: 20 లక్షలను దాటి: భయానకంగా

డిసెంబర్ 1 నాటికి

డిసెంబర్ 1 నాటికి

ఇప్పటికే లక్షన్నర మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి మరణించారు. 50 లక్షలకు పైగా కేసులు అక్కడ నమోదు అయ్యాయి. తాజాగా ఈ అంకెలు మరింత భయానకంగా పెరిగే అవకాశం ఉందని యూనివర్శటీ ఆఫ్ వాషింగ్టన్ ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. డిసెంబర్ 1 నాటికి అమెరికా వ్యాప్తంగా మూడు లక్షల మంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నగరాలన్నీ హాట్‌స్పాట్లుగా

నగరాలన్నీ హాట్‌స్పాట్లుగా

అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మరిన్ని కొత్త పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా నమోదు కావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూషన్ (ఐహెచ్ఎంఈ) నిపుణులు ఈ మేరకు ఓ నివేదిక రూపొందించారు. రానున్న రోజుల్లో కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉండొచ్చనే అంశాన్ని ఇందులో పొందుపరిచారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 రోలర్ కోస్టర్‌లా

రోలర్ కోస్టర్‌లా

అమెరికాలోని అనేక నగరాల్లో కరోనా వైరస్ స్థితిగతులు రోలర్ కోస్టర్‌ను తలపిస్తున్నాయని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టొఫర్ ముర్రే తెలిపారు. ఒక్కో రోజు గరిష్ఠ స్థాయికి పాజిటివ్ కేసులు చేరుకుంటున్నాయని, అదే సమయంలో వాటిల్లో క్షీణత కూడా కనిపిస్తోందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రజలు మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా మాత్రమే అరికట్టగలమని తెలిపారు. వ్యాక్తిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవచ్చని క్రిస్టొఫర్ అభిప్రాయపడ్డారు.

Recommended Video

Donald Trump : Facebook Twitter Removed Donald Trump's Post Over False Claim || Oneindia Telugu
లక్షా 62 వేలకు పైగా

లక్షా 62 వేలకు పైగా

ప్రస్తుతం అమెరికాలో లక్షా 62 వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయి. 50 లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డు అయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా బారిన పడి 1,62,804 మంది మరణించారు. 50,32,179 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా-5,41,250, ఫ్లోరిడా-5,10,389, టెక్సాస్-4,89,731 న్యూయార్క్-4,48,168 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక మరణాలు న్యూయార్క్‌లో నమోదు అయ్యాయి. 32,817 మంది మరణించారు. న్యూజెర్సీ-15,922, కాలిఫోర్నియా-10,021 మంది చనిపోయారు.

English summary
Health experts at University of Washington say nearly 300,000 people could die from COVID-19 in the US by December 1. According to a forecast by health experts at the University of Washington.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X