వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్: యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్((ఎఫ్‌డీఏ) మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చికిత్సలో ఆశాజనక ఫలితాలిస్తుందని భావిస్తూ భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఈ మందును వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

ఆ మందులతో హృదయ సంబంధిత వ్యాధులు..

ఆ మందులతో హృదయ సంబంధిత వ్యాధులు..

ఈ నేపథ్యంలోనే ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకం వల్ల తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ పరిణామాల గురించి ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే పొందుపరిచి ఉందని గుర్తుచేసింది. అయితే, రోగి పరిస్థితిని ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావాన్ని తగ్గించొచ్చని స్పష్టం చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే..

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే..

కరోనావైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ ఔషధం ఎంత వాడాలో అక్కడ ఉండే వైద్య సిబ్బందే నిర్ణయించుకోవాలని ఎఫ్‌డీఏ తెలిపింది. కరోనాపై సమర్థవంతంగా పోరాడే మందు కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని, అప్పటి వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని దృష్టిలో ఉంచుకునే చికిత్స అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించింది. ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని వాడేందుకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చేరి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న కరోనా రోగులకు మాత్రమే వైద్యుల సూచన మేరకు వినియోగించుకోవాలని సూచించింది. ఈ డ్రగ్ వాడకానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ వైద్యులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Recommended Video

Facebook Jio Deal : WhatsApp JioMart Benefits To Jio & FB And Users
ప్రపంచ దేశాలకు భారత ఔషధం..

ప్రపంచ దేశాలకు భారత ఔషధం..


భారతదేశం మాత్రమే ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయా దేశాల విజ్ఞప్తుల మేరకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మందులు కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో రోగాన్ని నయం చేసే సామర్థ్యం ఉందా? అనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, అమెరికాలో ఇప్పటికే కరోనా బారినపడి 50వేల మందికిపైగా మరణించగా, 9లక్షల మందికపైగా కరోనాబారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

English summary
The U.S. Food and Drug Administration on Friday cautioned against the use of malaria drug hydroxychloroquine in COVID-19 patients even as President Donald Trump, who has touted it as a “game changer,” advocated for an additional review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X