• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమరావతి సినిమా స్టైల్‌లో హత్య: మహిళకు మరణశిక్షఎలా అమలు చేశారంటే: 70 ఏళ్ల తరువాత

|

వాషింగ్టన్: గర్భిణీని హత్య చేసిన కిరాతక ఘటనలో దోషిగా తేలిన ఓ మహిళకు అమెరికా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. కొద్దిసేపటి కిందటే ఆమెకు విషపు ఇంజెక్షను ఇవ్వడం ద్వారా జైలు అధికారులు మరణశిక్షను అమలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల ప్రభుత్వ హయంలో మరణశిక్షను అమలు చేయడం ఇది 11వ సారి. ఓ మహిళకు అమెరికా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయడం 70 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ఫెడరల్ న్యాయస్థానం ఆమెకు విధించిన మరణశిక్షను యావజ్జీవంగా మార్చడానికి న్యాయవాది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఫైనల్ స్టేజ్: 25వ సవరణ ప్రయోగం: బలిపీఠంపై ట్రంప్: యూఎస్ హౌస్‌లో ఆ తీర్మానం ఆమోదం

 విషం నింపిన ఇంజెక్షన్..

విషం నింపిన ఇంజెక్షన్..

చివరి నిమిషంలో ఆమె తరఫు అడ్వొకేట్ దాఖలు చేసిన పిటీషన్‌ను తోసిపుచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. ఆమె పేరు లిసా మోంట్‌గోమేరీ. వయస్సు 52 సంవత్సరాలు. అమెరికా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు మరణశిక్షను అమలు చేశారు. సరిగ్గా 1:31 నిమిషాలకు విషాన్ని నింపిన ఇంజెక్షన్‌ను ఆమెకు ఎక్కించారు. ఇండియానా టెర్రె హౌట్‌లోని ఫెడరల్ కరెక్షనల్ కాంప్లెక్స్‌లో ఆమెకు మరణశిక్షను అమలు చేశారు.

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

గర్భాన్ని చీల్చి.. పిండం ఎత్తుకెళ్లి

గర్భాన్ని చీల్చి.. పిండం ఎత్తుకెళ్లి

ఇదివరకు తెలుగులో వచ్చిన అమరావతి సినిమాను తలపించేలా హత్యోదంతం ఇది. 2004లో ఓ గర్భిణీని మోంట్‌గోమేరీ అతి దారుణంగా హత్య చేశారు. తొమ్మిది నెలల గర్భాణ్ని కత్తితో చీల్చివేశారు. కడుపులో పిండాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రెండేళ్ల తరువాత ఆమె అరెస్ట్ అయ్యారు. 2008లో ఆమెకు మిస్సోరీ న్యాయస్థానం మరణశిక్షను విధించింది. అప్పటి నుంచి ఇండియానాలోని జైలులో ఆమె గడుపుతూ వచ్చారు. నిర్దోషిగా నిరూపించడానికి ఆమె తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి- మోంట్‌గోమేరీ మానసిక స్థితి బాగాలేదని, ఆమెకు పిచ్చిపట్టిందని నిరూపించే ప్రయత్నం చేశారు.

 పిచ్చి పట్టిందంటూ..

పిచ్చి పట్టిందంటూ..

దానికి అవసరమైన సాక్ష్యాధారాలను అడ్వొకేట్లు సమర్పించలేకపోయారు. ఫెడరల్ చట్టాల ప్రకారం.. అనారోగ్యంతో ఉన్నవారిని, మానిసిక వికలాంగులకు మరణశిక్షను విధించే వీలులేదు. దీనితో మోంట్‌గోమేరీ మానసిక సమతౌల్యాన్ని కోల్పోయారంటూ వాదించినప్పటికీ.. ఆ దేశం సుప్రీంకోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తన క్లయింట్‌కు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖాయం చేసిందని కెల్లీ హెన్రీ తెలిపారు. మోంట్‌గోమేరీకి మరణశిక్షను విధించిన విషయాన్ని ధృవీకరించారు.

ఈ వారంలో మరో రెండు మరణశిక్షలు

ఈ వారంలో మరో రెండు మరణశిక్షలు

అమెరికాలో ఈ వారం రోజుల వ్యవధిలో మరో రెండు మరణశిక్షలను అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు వాటి షెడ్యూల్‌ను కూడా ఫెడరల్ న్యాయస్థానం ప్రకటించింది. కోరే జాన్సన్ అనే దోషికి గురువారం మరణశిక్షను అమలు చేయాల్సి ఉంది. డస్టిన్ హిగ్స్ అనే దోషికి ఆ మరుసటి రోజు మరణశిక్షను అమలు చేస్తారు. నిజానికి- వారిద్దరికీ ఇదివరకే మరణశిక్షను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ బారిన పడటం వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు. వారిద్దరికీ కరోనా నెగెటివ్ రిపోర్ట్ రావడంతో. శిక్షను అమలు చేయడానికి చట్టపరంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

English summary
Lisa Montgomery, 52, was executed by lethal injection at the Federal Correctional Complex in Terre Haute, Indiana, and pronounced dead at 1:31 a.m. She is the 11th federal death row inmate to be executed during the Trump administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X