వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ప్రచారంలో ఫైటర్ జెట్ కలకలం: నిషేధిత ప్రాంతంలో సంచారం..విచారణ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. అయితే బుధవారం అనుకొని విధంగా ఘటన జరిగింది. అరిజొనాలో గల బుల్‌హెడ్ వద్ద ట్రంప్ ప్రసంగిస్తున్నారు. అయితే ఆ సమీపంలోకి ఓ విమానం వచ్చింది. వాస్తవానికి దేశాధినేతలు/ ప్రధానమంత్రులు పర్యటించే/ ప్రసంగించే చోట వాయుమార్గంలో కూడా ఆంక్షలు ఉంటాయి. ఆ సమీపంలో వెళ్లేందుకు సంబంధిత వాయుసేన అనుమతించవు. బుధవారం ఒక్కసారిగా విమానం రావడంతో కలకలం రేగింది.

అయితే దానిని ఓ విమానం అడ్డుకొవడంతో మంటలు చెలరేగాయి. ప్రసంగించే సమయంలో ట్రంప్ దానిని పరిశీలించి కామెంట్ కూడా చేశారు. ఘటనపై దర్యాప్తు జరపడానికి ఎఫ్-16 విమానాన్ని పంపించామని నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ప్రతినిధి జాన్ కార్నెలియో తెలిపారు. ఇదీ ముమ్మాటికీ ఎయిర్ ఫోర్స్ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతోందన్నారు. సదరు విమానంలో మంటలు వచ్చిన తర్వాత నిషేధిత ప్రాంతం నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.

US fighter jet intercepts aircraft near Trump rally, deploying signal flares

చివరి విడతగా అరిజొనాలో ట్రంప్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం కూడా ఎన్నికల చివరి దశ ప్రచారం చేశారు. అయితే అరిజొనాలో మాత్రం కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. బుధవారం ట్రంప్ ర్యాలీలో చాలా మంది మాస్క్ ధరించి కనపించారు. కానీ ఇక్కడ సామాజిక దూరం పాటించకపోవడం మైనస్‌గా మారింది. అయితే ఫుటేజీలో చిన్న విమానం మాత్రం కనిపించలేదు. కానీ ఫైటర్ జెట్ మాత్రం స్పష్టంగా కనిపించింది.

English summary
An aircraft entered restricted air space over President Donald Trump's rally in Bullhead City, Arizona, on Wednesday, leading to a fighter jet being scrambled to intercept it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X