వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా ముప్పు: భారత సాయం కోరిన అమెరికా

|
Google Oneindia TeluguNews

Recommended Video

US seeks India help to do more on North Korea | Oneindia Telugu

వాషింగ్టన్‌: వరుస క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అమెరికా హెచ్చరికలు చేస్తున్నా.. అవేం పట్టనట్లు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తాము యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలు పంపుతూనే ఉన్నారు.

యుద్ధమొస్తే! ఉ.కొరియా సర్వనాశనమే, కిమ్‌ను బతకనివ్వం: అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్యుద్ధమొస్తే! ఉ.కొరియా సర్వనాశనమే, కిమ్‌ను బతకనివ్వం: అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా.. ప్రపంచ ముప్పుగా పరిణమించిందని ఆ దేశంపై ఒత్తిడి చేసేందుకు భారత్‌ సాయం చేయాలని అగ్రరాజ్యం అమెరికా కోరింది. ప్యాంగ్యాంగ్‌ ఖండాంతర అణు క్షిపణుల ప్రయోగాలు చేపట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు మిత్రదేశాలు ముందుకు రావాలని అమెరికా పిలుపునిచ్చింది.

రెండో స్థానం మనదే: 46వేల మందికి అమెరికా శాశ్వత పౌరసత్వంరెండో స్థానం మనదే: 46వేల మందికి అమెరికా శాశ్వత పౌరసత్వం

అమెరికా టార్గెట్‌గా క్షిపణులు

అమెరికా టార్గెట్‌గా క్షిపణులు

ఉత్తర కొరియా బుధవారం హ్వాసంగ్‌-15 ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడినట్టు సమాచారం. ఈ అణు క్షిపణి దాదాపు 13,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలోని ఏ భాగానైన్నా తాకగలదని భావిస్తున్నారు.

సర్వనాశనమే..

సర్వనాశనమే..

ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని చేస్తామని అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. అంతేగాక, ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సహా మిత్రదేశాల సాయం కోరింది.

భారత్‌ సాయం కోసం..

భారత్‌ సాయం కోసం..

‘భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీతో మాకు చక్కని అనుబంధం ఉంది. ఉత్తర కొరియాపై ఒత్తిడి తేగల దేశాలపై మా విస్తృత చర్చల్లో చర్చించాం' అని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి హేథర్‌ నౌవర్ట్‌ తెలిపారు. ‘ఉత్తర కొరియా అంతర్జాతీయ సమస్య. ఇది ప్రపంచ ముప్పుగా పరిణమించింది. ఈ అంశంపై భారత్‌ మాకు మరింత సాయం చేయగలదని ఆశిస్తున్నాం. ప్రభుత్వంతో మేం ఈ తరహా చర్చలు కొనసాగిస్తాం' అని అన్నారు.

తీవ్ర పరిణామాలే.. చైనా, రష్యాలపై ఒత్తిడి

తీవ్ర పరిణామాలే.. చైనా, రష్యాలపై ఒత్తిడి

ఉత్తర కొరియాతో చైనా, రష్యాకు ప్రత్యేక ఆర్థిక సంబంధాలు ఉన్నాయని హేథర్‌ నౌవర్ట్‌ చెప్పారు. ‘ప్యాంగ్యాంగ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ బంధాన్ని ఉపయోగించాలని మేం చైనాను కోరుతున్నాం. వారితో మా చర్చలు కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు చర్చించాం. చర్చల్లో భాగంగా తుది భేటీకి అధ్యక్షుడు ట్రంప్‌, ప్రభుత్వ కార్యదర్శి బీజింగ్‌ వెళ్లారు. ఉత్తర కొరియాపై చాలా దేశాలు ఒత్తిడి చేయగలవు. చైనాపై మాకు ఎక్కువ నమ్మకం ఉంది. రష్యా, చైనా సమక్షంలోనే ప్యాంగ్యాంగ్‌పై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించాం. ఆ దేశ వాసులను వెనక్కి పంపేయాలని మిగతా దేశాలను కోరాం. ఎందుకంటే బానిసల్లా పనిచేసే వారు సంపాదించే డబ్బు వారి వద్ద ఉండదు. 20 కన్నా ఎక్కువ దేశాలు ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆ దేశం నుంచి దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పిస్తున్నాయి. ఒత్తిడి ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఉత్తరకొరియా తన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది' అని హేథర్‌ స్పష్టం చేశారు.

English summary
Terming North Korea a "global threat", the US said today that it expects India to do more to help America and its international allies exert pressure on Pyongyang to give up its missile and nuclear weapons programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X