వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అభిశంసన... హౌస్‌లో తీర్మానం ప్రవేశపెట్టిన డెమోక్రాట్స్.. కళంక నేతగా దిగిపోవడం ఖాయమే?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష పదవి చరిత్రలోనే ఆ పదవికి అత్యంత కళంకం తెచ్చిన నేతగా డొనాల్డ్ ట్రంప్ మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేంత పని చేసిన ట్రంప్‌ను డెమోక్రాట్లే కాదు రిపబ్లికన్లు కూడా ఉపేక్షించేట్లేదు. ఈ నేపథ్యంలో అధికార మార్పిడికి ముందే ట్రంప్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రతినిధుల సభలో సోమవారం(జనవరి 11) అభిశంసన తీర్మానాన్ని డెమోక్రాట్లు అధికారికంగా ప్రవేశపెట్టారు.

అభిశంసన తీర్మానంలో ఆర్టికల్‌లోని అంశాలు...

అభిశంసన తీర్మానంలో ఆర్టికల్‌లోని అంశాలు...

తన మద్దతుదారులను ఎగదోసి ప్రజాస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటును ప్రేరేపించారన్న అభియోగాలతో ట్రంప్‌పై డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హౌస్ బ్రీఫ్ సెషన్ సందర్భంగా డెమోక్రాట్లు టెడ్ లియు, డేవిడ్ సిసిలిన్,జామీ రస్కిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ వారం లోగా అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. బహుశా బుధవారం(జనవరి 13) దీనిపై ఓటింగ్ జరగవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అభిశంసన తీర్మానానికి సంబంధించిన ఆర్టికల్‌లో.. ఎన్నికల్లో తానే గెలిచానని ట్రంప్ పదేపదే తప్పుడు వాదనలు చేయడం,తన ప్రసంగాలు,సందేశాలతో కేపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను రెచ్చగొట్టడం వంటి అంశాలను చేర్చారు.

మంగళవారం ఆ తీర్మానంపై ఓటింగ్...

మంగళవారం ఆ తీర్మానంపై ఓటింగ్...

అమెరికాలోని స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన జార్జియాలో తనకు అనుకూలంగా ఫలితాన్ని తారుమారు చేయాలని జార్జియా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బ్రాడ్‌ రాఫెన్స్పెర్జర్‌కు ట్రంప్ ఫోన్ కాల్ చేయడాన్ని కూడా తాజా అభిశంసన తీర్మానంలో పొందుపరిచారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇక్కడ డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందడంతో ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని ట్రంప్ ఇలా అడ్డదారిలో అధికార దుర్వినియోగానికి యత్నించారు. అభిశంసన తీర్మానం కంటే 25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను గడువు కంటే ముందే గద్దె దించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం(జనవరి 12) ప్రతినిధుల సభలో ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. నిజానికి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని హౌస్ మెజారిటీ లీడర్ స్టెనీ హోయర్ విజ్ఞప్తి చేయగా రిపబ్లికన్ నేత అలెక్స్ మూనే అందుకు అభ్యంతరం చెప్పారు.

శాశ్వతంగా తప్పించే ఛాన్స్?

శాశ్వతంగా తప్పించే ఛాన్స్?

తాజా అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందితే రెండుసార్లు ఈ పరిస్థితిని చవిచూసిన నేతగా ట్రంప్ అమెరికా చరిత్రలో మిగిలిపోతారు. ట్రంప్ విజయావకాశాలను ప్రభావితం చేసేందుకు ఉక్రెయిన్‌కి చెందిన కొంతమంది వ్యక్తులు డెమొక్రాట్లకు సహాయం చేశారన్న ఆరోపణలతో ట్రంప్ 2019లో అమెరికా హౌస్‌లో అభిశంసనకు గురయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ తనదే విజయమని ట్రంప్ అవాస్తవాలు,అసత్యాలు ప్రచారం చేశారు. దీంతో స్థానిక మీడియా సైతం ఆయన ప్రసంగాలను ప్రసారం చేయకుండా నిలిపివేసింది.ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పదేపదే తన అనుచరులను,మద్దతుదారులను రెచ్చగొడుతూ కేపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారు. దీంతో ట్రంప్ లాంటి నేతకు అమెరికా రాజకీయాల్లో స్థానం ఉండకూడదని అక్కడి నేతలు భావిస్తున్నారు. తాజా అభిశంసన తీర్మానంతో అధ్యక్ష పదవి నుంచే కాక ఆయన్ను శాశ్వతంగా రాజకీయాల నుంచి నిషేధించే అవకాశం కూడా లేకపోలేదు.

English summary
House Democrats’ impeachment resolution was formally introduced Monday during the House’s brief session. They are charging President Trump with "incitement of insurrection" for his role in last week's riots at the US Capitol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X