వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అభిశంసన.. అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్..? కేపిటల్ భవనం వద్ద భారీ భద్రత...

|
Google Oneindia TeluguNews

అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణకు సవరణ ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గడువు కన్నా ముందే గద్దె దించేందుకు ప్రతినిధుల సభ(కాంగ్రెస్) సన్నద్దమైంది. బుధవారం(జనవరి 13) ప్రతినిధుల సభలో ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు రిపబ్లికన్లు కూడా ట్రంప్‌ అభిశంసనకు మద్దతుగా తాము కూడా ఓటింగ్‌లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రతినిధుల సభలో ఈ తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. హౌస్‌లో ఎలాగూ డెమోక్రాట్లదే ఆధిపత్యం గనుక తీర్మానం సులువుగానే పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

25వ సవరణ ద్వారా ఏం జరుగుతుంది...

25వ సవరణ ద్వారా ఏం జరుగుతుంది...

అమెరికా ప్రతినిధుల సభలో 25వ సవరణ తీర్మానం గట్టెక్కితే అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనను చవిచూసిన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోనున్నారు. నిజానికి ఉపాధ్యక్షుడి హోదాలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌పై అభిశంసనకు మైక్ పెన్స్‌ చర్యలు తీసుకోవాలని ప్రతినిధుల సభ కోరింది. అయితే అందుకు పెన్స్ నిరాకరించడంతో దీనిపై సభలో ఓటింగ్ తప్పలేదు. 25వ సవరణ ప్రకారం ఉపాధ్యక్షుడు గానీ, కేబినెట్‌లో మెజారిటీ సభ్యులు గానీ, కాంగ్రెస్ సూచించిన ఏ సంస్థ అయినా అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు.

కేపిటల్ భవనం వద్ద భద్రత పెంపు...

కేపిటల్ భవనం వద్ద భద్రత పెంపు...

అమెరికా ప్రతినిధుల సభలో 25వ సవరణపై ఓటింగ్ సందర్భంగా కేపిటల్ భవనం వద్ద భద్రతను పెంచారు. ఈ నెల 6వ తేదీన అధ్యక్షుడి ఎన్నికను ధ్రువీకరించేందుకు క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సభ్యులు సమావేశమైన సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రతినిధుల సభలో 25వ సవరణపై ఓటింగ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేపిటల్ భవనం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ప్రతినిధుల సభలోకి హౌస్ సభ్యులు,సిబ్బంది మెటల్ డిటెక్టర్స్ ద్వారా లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సభలోకి గన్స్ లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లనివ్వకుండా ఈ చర్యలు తీసుకున్నారు.

రిపబ్లికన్ల మద్దతు...

రిపబ్లికన్ల మద్దతు...

ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ 25వ సవరణకు ఆమోదం లభిస్తే ట్రంప్ గడువు కన్నా ముందే గద్దె దిగడం ఖాయం. నిజానికి ప్రతినిధుల సభలో దీనికి ఆమోదం లభించినా సెనేట్‌లో ఆమోదం పొందేందుకు ఆలస్యం జరగవచ్చునన్న వాదన వినిపించింది. కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఉభయ సభల్లోనూ ఈ తీర్మానం త్వరితగతిన ఆమోదం పొందే దిశగా డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్లు కూడా ఇందుకు మద్దతునిస్తుండటంతో ట్రంప్‌ను సాగనంపే ప్రక్రియలో జాప్యం జరగకపోవచ్చు.

English summary
The US House of Representatives on Wednesday began debating legislation to impeach President Donald Trump for the second time of his presidency. The House is set to first hold a vote setting rules for Wednesday's debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X