• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డొనాల్డ్ ట్రంప్ మెడపై కత్తి: ముహూర్తం ఫిక్స్: ఏ క్షణమైనా: అత్యంత అవమానకరంగా

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై అభిశంసన కత్తి వేలాడుతోంది. పదవి నుంచి వైదొలగడానికి ముందే.. ఆయనకు ఉద్వాసన పలకడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ వారంలోనే ఆయనపై యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ సైతం ధృవీకరించారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్.. అత్యంత అవమానకరంగా వైదొలగడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా స్పీకర్ కార్యాలయం ఫర్నిచర్ చోరీ: కొమ్ముల టోపీతో భయపెట్టిన ట్రంప్ సపోర్టర్: అరెస్టులు

గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయాన్ని సాధించారు. ఈ నెల 20వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. ఈ నెల 7వ తేదీన ట్రంప్ మద్దతుదారులు వేలాదిమంది వాషింగ్టన్‌లోని పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌ను ముట్టడించారు. యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లోకి దూసుకెళ్లారు. సమావేశాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.

US House Speaker Nancy Pelosi confirms that will move to impeach Donald Trump this week

ఈ ఘటనకు డొనాల్డ్ ట్రంప్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ డెమొక్రటిక్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లు ట్రంప్‌తో ఓ మినీ యుద్ధమే ప్రారంభించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ వంటి నేతలు సైతం ఈ ఉదంతంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌కు ఉద్వాసన పలకాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీని తరువాత రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ న్యాన్సీ పెలోసీ జోక్యం చేసుకోవడంతో ట్రంప్ అభిశంసన దిశగా అడుగులు పడుతున్నాయి.

ఈ వారమే ఆయనకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ సారథ్యంలోని కేబినెట్.. ఈ తీర్మానాన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోన్నామంటూ న్యాన్సీ పెలోసీ సైతం నిర్ధారించారు. దీనికోసం తాను మైక్ పెన్స్‌కు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక్క రోజు కూడా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదంటూ ఇదివరకు తాను చేసిన వ్యాఖ్యానాలను పెలోసీ.. సమర్థించుకున్నారు. ట్రంప్ ఉద్వాసన తప్పదనే సంకేతాలను ఆమె పంపించారు.

English summary
US House of Representatives Democrats plan a vote on Monday to urge Vice President Mike Pence to take steps to remove President Donald Trump from office after his supporters' deadly storming of the Capitol, before attempting to impeach him again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X