వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ మెడకు ఉద్వాసన ఉచ్చు: యూఎస్ హౌస్‌లో డిబేట్ షురూ: సొంత పార్టీలోనూ సెగ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు పదవీ గండం పొంచివుంది. అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ నెల 19వ తేదీన ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉండగా.. అంతకుముందే ఆయననకు ఉద్వాసన పలకడానికి యూఎస్ హౌస్‌ చర్యలు చేపట్టింది. ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి 25వ సవరణను ప్రయోగించాలనే అంశంపై డిబేట్ నడుస్తోంది. ఓటింగ్ చేపట్టారు. విచిత్రం ఏమిటంటే- అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులు సైతం ట్రంప్ ఉద్వాసనకు జైకొడుతున్నారు.

 డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులు

మెడకు చుట్టుకున్న మద్దతుదారుల ఆందోళన..

మెడకు చుట్టుకున్న మద్దతుదారుల ఆందోళన..

వాషింగ్టన్‌ అల్లర్లు చోటుచేసుకుని ఉండకపోతే.. ట్రంప్ ఈ దుస్థితిని ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వేలాదిమంది ఆయన అభిమానులు చేపట్టిన ఆందోళనల ప్రదర్శనలు.. కేపిటల్ బిల్డింగ్‌పై దండెత్తడం, పోలీసులు కాల్పులు జరపడం.. వారిని మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ ప్రసంగించడారంటూ ఆరోపణలు వెల్లువెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో.. అగ్రరాజ్య అధ్యక్షుడిగా అర్ధాంతరంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

25వ సవరణకు మైక్ పెన్స్ నో..

25వ సవరణకు మైక్ పెన్స్ నో..

యూఎస్ కాంగ్రెస్‌లో ఈ డిబేట్ ఆరంభానికి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్‌కు ఉద్వాసన పలకడానికి 25వ సవరణను ప్రవేశపెట్టాలంటూ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ చేసిన విజ్ఞప్తిని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. తాను ఆ సవరణను ప్రవేశపెట్టలేనని తేల్చేశారు. మైక్ పెన్స్ నిరాకరణతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 25వ సవరణపై యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో డిబేట్ నడుస్తోంది. ఓటింగ్ చేపట్టారు. ఇందులో నెగ్గితే.. మైక్ పెన్స్‌కు ఇష్టం లేకపోయినా..ఆ సవరణను సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

 ప్రత్యామ్నాయంగా అభిశంసన..

ప్రత్యామ్నాయంగా అభిశంసన..

25వ సవరణపై ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడమంటూ జరిగితే.. ప్రత్యామ్నాయంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదెలా ఉన్నప్పటికీ.. ఈ నెల 19వ తేదీన ట్రంప్ పదవీకాలం ముగియకముందే.. ఆయనను దింపేయడానికి జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. 25వ సవరణ తనను ఏమీ చేయలేదంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌‌లో పర్యటిస్తోన్నారు. అభిశంసన తీర్మానం ఉత్తిదేనని, పదవీకాలం పూర్తయ్యేంత వరకూ కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు.

కొనసాగుతోన్న ఓటింగ్..

కొనసాగుతోన్న ఓటింగ్..


మరోవంక- ట్రంప్‌కు ఉద్వాసన అవసరమైన ఏర్పాట్లు యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో చకచకా సాగుతున్నాయి. దీనికి అవసరమైన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రవేశపెట్టారు. దీనిపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఓటింగ్ ఉంటుంది. ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇందులో 25 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా చేపట్టిన డిబేట్‌లో భాగస్వామ్యులు అయ్యారు. మెజారిటీ సభ్యులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక్క రోజు కూడా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదంటూ ఇదివరకు తాను చేసిన వ్యాఖ్యానాలను పెలోసీ.. సమర్థించుకున్నారు.

English summary
House Democrats introduced an article of impeachment against President Trump on Monday, accusing him of inciting insurrection at the Capitol building on January 6. Senate Majority Leader Mitch McConnell told GOP colleagues on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X