వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ పై నిషేధం విధించిన అమెరికా ... ట్రంప్ ఆర్డర్స్.. 45 రోజుల్లో అమలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్ పై అమెరికా నిషేధం విధించింది . ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.యూఎస్ జాతీయ భద్రతను కాపాడటానికి టిక్ టాక్ యజమానులపై అమెరికా దూకుడుగా చర్యలు తీసుకోవాలి అని ట్రంప్ తన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు.

Recommended Video

TikTok, WeChat ని బ్యాన్ చేసిన Donald Trump ఇండియా బాటలో అమెరికా, చైనాపై యుద్ధం ఆరంభం ! || Oneindia

చైనా డిమాండ్ కు నో అన్న ఇండియా ... అక్కడ నుండి వెనక్కు తగ్గేది లేదు.. రీజన్ ఇదే !!చైనా డిమాండ్ కు నో అన్న ఇండియా ... అక్కడ నుండి వెనక్కు తగ్గేది లేదు.. రీజన్ ఇదే !!

చైనాపై యూఎస్ యుద్ధం ...కరోనాతోనే ఆరంభం

చైనాపై యూఎస్ యుద్ధం ...కరోనాతోనే ఆరంభం

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇంతగా విజృంభించడానికి కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అందులో ముఖ్యంగా అమెరికా కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధం ప్రకటించి చైనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికాను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి చైనా ఇదంతా చేస్తుందని ట్రంప్ మొదటి నుండి ఆరోపిస్తున్నారు.

టిక్ టాక్, వి చాట్ పై నిషేధం..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం

టిక్ టాక్, వి చాట్ పై నిషేధం..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా యాప్స్ టిక్ టాక్, వి చాట్ వంటి వాటిపై నిషేధం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. 45 రోజుల్లోగా అమెరికాలో ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఇండియా చైనాతో యుద్ధం ప్రకటించి 59 యాప్స్ ను బాన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మరో రెండు వందల యాభై యాప్స్ పై కూడా ఇండియా నిఘా పెట్టింది. ఇదే సమయంలో ఇండియా బాటలో అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసి చైనా ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టాలని చూస్తోంది.

సమాచార చోరీ జరుగుతుందనే నిర్ణయం

సమాచార చోరీ జరుగుతుందనే నిర్ణయం

చైనాకు చెందిన బైట్‌డాన్స్ యూఎస్ లోని దక్షిణ కాలిఫోర్నియాలో టిక్ టాక్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. సమాచార,సాంకేతిక పరిజ్ఞానం మరియు సేవలకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకోవటం అవసరమని ట్రంప్ ఆదేశించారు.టిక్ టాక్ మొబైల్ అప్లికేషన్ అమెరికాలో 175 మిలియన్లు, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కన్నా ఎక్కువ డౌన్‌లోడ్ చేయబడింది.

అమెరికన్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని యూఎస్ వాదన

అమెరికన్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని యూఎస్ వాదన

టిక్‌టాక్ దాని వినియోగదారుల నుండి లొకేషన్ డేటా మరియు బ్రౌజింగ్ మరియు సెర్చ్ హిస్టరీలతో సహా సమాచారాన్ని సేకరిస్తుంది అని ఆర్డర్ వాదించింది. ఈ డేటా సేకరణ ద్వారా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అమెరికన్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని యూఎస్ వాదన .ఫెడరల్ ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్ల స్థానాలను ట్రాక్ చేయడానికి, బ్లాక్ మెయిల్ కోసం మరియు కార్పొరేట్ గూడచర్యాన్ని నిర్వహించడానికి టిక్‌టాక్ నుండి వచ్చిన డేటాను చైనా ఉపయోగించుకోవచ్చు అన్నది యూఎస్ వాదన . ట్రంప్ ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, మరియు యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలు, ఫెడరల్ గవర్నమెంట్ ఫోన్‌లలో టిక్‌టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించాయి.

English summary
US President Donald Trump on Thursday ordered that a ban on interacting with popular social media platform TikTok or its Chinese parent company take effect in 45 days. "The United States must take aggressive action against the owners of TikTok to protect our national security," Trump said in an executive order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X