వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ: ముస్లీంల రాకపై అమెరికా కోర్టు స్టే

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన జారీ చేసిన ఆదేశాలను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి శనివారం రాత్రి నిలిపివేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన జారీ చేసిన ఆదేశాలను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి శనివారం రాత్రి నిలిపివేశారు. ఈ మేరకు అత్యవసర ఆదేశాలను జారీ చేశారు.

ఏడు ముస్లిం ఆధిక్య దేశాల వారు అమెరికా రాకుండా ట్రంప్‌ విధించిన ఆంక్షలను ఆ దేశ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం.

ముస్లీం దేశాలకు షాకిచ్చిన ట్రంప్‌కు ఇరాన్ ఝలక్ముస్లీం దేశాలకు షాకిచ్చిన ట్రంప్‌కు ఇరాన్ ఝలక్

ట్రంప్‌ నిర్ణయంపై ది అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ శనివారం కోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి యాన్‌ డొనెల్లి విచారణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.

 US judge blocks Trump's order to ban Muslim travellers

దీని ప్రకారం చట్టపరమైన దరఖాస్తు ఆమోదం, వీసాతో అమెరికాలో నివసించే శరణార్థులు, అమెరికాలో ప్రవేశించడానికి చట్టపరమైన అనుమతులు ఉన్న వ్యక్తులను పంపించి వేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్టైన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

శరణార్థుల హక్కుల ప్రాజెక్ట్‌ లీగల్‌ డైరెక్టర్‌ లీ గెలెర్ట్న్‌ ఈ కేసును వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చట్టం కింద బాధితులైన వారితో మాట్లాడి అవగాహన కల్పిస్తామని, కనీసం వారు తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు.

జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే వాసీలతో అమెరికా వచ్చిన వారిని దేశం నుంచి పంపించడానికి అవకాశముండదు.

English summary
A federal judge has blocked part of President Donald Trump's executive order on immigration, ruling that travellers who have already landed in the US with valid visas should not be sent back to their home countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X