వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు- టిక్‌టాక్‌ డౌన్‌లోడ్ల నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ చైనీస్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్ డౌన్‌లోడ్లను నిషేధించిన ట్రంప్‌కు స్ధానిక కోర్టు షాకిచ్చింది. టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు ఫెడరల్ కోర్టు జడ్జి ఉత్తర్వలు జారీ చేశారు.

టిక్ టాక్‌ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్‌ బదులు ఒరాకిల్‌కు మొగ్గు- ట్రంప్‌ పంతం నెగ్గిందిలా..టిక్ టాక్‌ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్‌ బదులు ఒరాకిల్‌కు మొగ్గు- ట్రంప్‌ పంతం నెగ్గిందిలా..

భద్రతా కారణాలతో టిక్‌టాక్‌ యాప్‌ను అమెరికాలో డౌన్‌లోడ్లు చేసుకోకుండా నిషేధించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కార్ల్‌ నికోలస్‌ సంచలన ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్‌ డీసీలో తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. టిక్‌టాక్‌ వాడకానికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన మరికొన్ని నిషేదాజ్ఞలపై మాత్రం సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఇది ట్రంప్‌ సర్కారుకు కొంత మేరక ఊరటనిచ్చింది.

us judge suspends trump ban on tiktok app downloads

Recommended Video

TikTok, Wechat పై నిషేధం విధించిన US.. వచ్చే ఆదివారం నుంచి డౌన్‌లోడ్‌లు నిలిపివేత!!

చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా టిక్‌టాక్‌పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టిన ట్రంప్‌ యాప్‌ డౌన్‌లోడ్లతో పాటు వాడకంపైనా నిషేధం విధించారు. దీంతో అమెరికాకు చెందిన యాపిల్‌, గూగుల్‌ వంటి సంస్ధలు తమ స్టోర్ల నుంచి యాప్‌ను తొలగించాయి. అమెరికాలో స్ధానిక సంస్ధకు టిక్‌టాక్‌ను విక్రయిస్తే నిషేధం తొలగించేందుకు సిద్ధమని ట్రంప్‌.. సంస్ధ యజమాని బైట్‌ డాన్స్‌ కు ప్రతిపాదించారు. ట్రంప్‌ ఉత్తర్వులపై బైట్‌ డాన్స్‌ స్ధానిక కోర్టుల్లో న్యాయపోరాటం సాగిస్తోంది. ఓ దశలో మైక్రోసాఫ్ట్‌ లేదా ఒరాకిల్‌కు టిక్‌టాక్‌ను కట్టబెట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న ట్రంప్‌కు టిక్‌టాక్‌పై కోర్టు ఉత్తర్వులు ఇబ్బందికరంగా మారాయి.

English summary
us president donald trump’s ban on tiktok was temporarily blocked by a federal judge, dealing a blow to the government in its showdown with the popular chinese-owned app that it says threatens national security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X