వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ బొనాంజా: హోటల్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... జీవితకాలం ఫ్రీ ఫుడ్ ఆఫర్ కొట్టేసింది

|
Google Oneindia TeluguNews

అమెరికా: ఓ రెస్టారెంటులో ఓ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మ్యాగీ, రాబర్ట్ అనేవారు దంపతులు. మ్యాగీకీ నెలలు నిండి డెలివరీ సమయం దగ్గరపడటంతో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళదామని రాబర్ట్ అతని ఇద్దరి కూతుళ్లను కూడా కారులో ఎక్కించుకున్నాడు. దారి మధ్యలో తన స్నేహితుడి ఇంట్లో ఇద్దరి కూతుళ్లను డ్రాప్ చేసి ఆ తర్వాత మ్యాగీని హాస్పిటల్‌కు తీసుకెళుదామనుకున్నాడు. తన స్నేహితుడికి చిక్ ఫిల్ ఏ రెస్టారెంటు దగ్గరకు రమ్మనాడు.

US lady gives birth to a baby in Hotel and Hotel promises free food for life time

స్నేహితుడు వచ్చి రాబర్ట్ పిల్లలను తీసుకెళ్లాడు. తను అలా పిల్లలను తీసుకెళ్లగానే మ్యాగీకి నొప్పులు మొదలయ్యాయి. అప్పటికే రాత్రి 10 గంటలు కావడంతో రెస్టారెంట్ మూసేసే సమయం అయ్యింది. వెంటనే తనను వాష్ రూంకు తీసుకెళ్లాల్సిందిగా మ్యాగీ కోరింది. దీంతో రెస్టారెంట్ తలుపును కొట్టగా అందులో సిబ్బంది తలుపులు తెరిచారు. వెంటనే మ్యాగీని వాష్‌రూంకు తీసుకెళ్లారు. అయితే అక్కడే నొప్పులు తీవ్రతరం అయ్యాయి. కాస్త ఓపిక పట్టాలని పదే పదే రాబర్ట్ అభ్యర్థించాడు. ఇక మ్యాగీని అక్కడి నుంచి తరలించలేనని గ్రహించి తనే ధైర్యంగా ఒక అడుగు ముందుకేశాడు.

US lady gives birth to a baby in Hotel and Hotel promises free food for life time

కాసేపటికి బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడం చూసి వెంటనే రాబర్ట్ రంగంలోకి దిగాడు. బిడ్డ మెడకు పేగులు చుట్టుకోవడంతో మెల్లగా వాటిని తొలగించాడు. అంబులెన్స్‌కు కబురు పెట్టండని మేనేజర్‌కు చెప్పి... టవెల్స్ ఉంటే తీసుకురావాల్సిందిగా కేకలు వేశాడు రాబర్ట్. ఇక టవెల్ తీసుకొచ్చే లోపు బిడ్డ పూర్తిగా బయటకు వస్తుండటంతో రాబర్ట్ తను వేసుకున్న షర్ట్‌ను తీసి బిడ్డను అందులో చుట్టేశాడు. మరోవైపు అంబులెన్స్ దారి మధ్యలో ఉండగా అందులోని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి... డాక్టర్ చెప్పినట్లుగా ఫాలో అయి బిడ్డను జాగ్రత్తగా డెలివరీ చేశామని రాబర్ట్ తన ఫేస్ బుక్ పేజ్ పై రాసుకున్నాడు.

US lady gives birth to a baby in Hotel and Hotel promises free food for life time

మొత్తానికి కంగారు, భయం, ఆందోళన మధ్య జరిగిన డెలివరీతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని రాబర్ట్ తెలిపాడు. తమ రెస్టారెంట్‌లో బిడ్డకు జన్మనిచ్చినందున ఆ హోటల్ యాజమాన్యం రాబర్ట్ బిడ్డకు బంపర్ బొనాంజా ప్రకటించింది. జీవితకాలం బిడ్డకు తమ హోటల్‌లో ఉచితంగా భోజనం వసతి కల్పించడంతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది.

English summary
It was just another day when Maggie Griffin and her husband, Robert Griffin, pulled into US food joint Chick-fil-A's parking lot to drop off their other two daughters with a family friend.But things took an unexpected turn, when Maggie who was close to her due date, fell into early labour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X