వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్-4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్లు రద్దు: ట్విస్టిచ్చిన టెక్ దిగ్గజాలు, 65 వేలు ఇండియన్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తే అమెరికాకు నష్టమే

న్యూయార్క్:అమెరికాలో హెచ్ -4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు రద్దు చేయాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత నెలకొంది. ఈ ప్రతిపాదన అమెరికాకు తీవ్ర నష్టాన్ని చేసే అవకాశం ఉందని టెక్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

దీనికి తోడుగా హెచ్ -4 వీసాలు కలిగి ఉన్నవారికి ఉద్యోగాలను ఇచ్చే విషయాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు వత్యిరేకిస్తున్నారు.

వారికి వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తే నష్టమే

వారికి వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తే నష్టమే

అమెరికాలో హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు ఇవ్వకూడదని తీసుకొస్తున్న ప్రతిపాదన పట్ల అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో పాటు టెక్ కంపెనీల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్ వంటి కంపెనీ కూడ ఈ రకమైన ప్రతిపాదనను విరమించుకోవాలని అమెరికన్ సర్కార్ ను కోరుతోంది. దీనివల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాకు దెబ్బే

అమెరికాకు దెబ్బే

హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు ఇవ్వకుండా వర్క్ పర్మిట్స్ రద్దు చేయాలన్న ప్రతిపాదన అమెరికా ఆర్ధిక వ్యవస్థకే ప్రమాదమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్‌-1బీ వీసాలు ఆ హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్‌-4 వీసాలను మంజూరు చేస్తారు. ఈ వీసాలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నిలిపివేయడం వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

65 వేల మంది భారతీయులు

65 వేల మంది భారతీయులు

హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో సుమారు 65 వేల మంది ఉంటారని ఓ అంచనా. వీరు ప్రస్తుతం అమెరికాలోని పలు రంగాల్లో విదులను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న వారి ఉద్యోగావకాశాలను విదేశీయులు కొల్లగొడుతున్నారని హెచ్ 4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలు జరిగితే అమెరికాలోని సుమారు 65 వేల మంది ఇండియన్స్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

80 శాతం మహిళలే

80 శాతం మహిళలే

అమెరికాలో హెచ్ -4 వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నవారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని ఓ అంచనా. స్వదేశాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలు చేసి వివాహం చేసుకొన్నాక తమ జీవిత భాగస్వామితో కలిసి అమెరికాలో విధులను నిర్వహిస్తున్నారు.ఇక్కడ పనిచేయడమే కాకుండా అమెరికా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. కొందరు గ్రూపులుగా ఏర్పడి కంపెనీలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలను కూడ కల్పిస్తున్నారు. హెచ్ -4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేస్తే ఆర్ధిక వ్యవస్థకు కూడ ఇబ్బందులు తప్పవని ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్‌ అభిప్రాయపడింది.

 భారీగా తగ్గిన ‘హెచ్‌–1బీ’ వీసాలు

భారీగా తగ్గిన ‘హెచ్‌–1బీ’ వీసాలు

అమెరికాలోని భారతీయ కంపెనీలకు జారీ అయిన హెచ్‌-1బీ వీసాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2015తో పోలిస్తే 2017లో ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలకు కలిపి లభించిన హెచ్‌-1బీ వీసాల సంఖ్య ఏకంగా 43%తగ్గింది. 7 ప్రధాన భారతీయ కంపెనీలకు కలిపి 2017లో 8,468 హెచ్‌-1బీ వీసాలు లభించాయి. 2015లో ఈ సంఖ్య 14,792 గా ఉంది. 2017లో అత్యధికంగా టీసీఎస్‌కు 2,312, ఇన్ఫోసిస్‌కు 1,218, విప్రోకు 1,210 వీసాలు లభించాయి. 2015తో పోలిస్తే ఈ కంపెనీలు కొత్తగా పొందిన వీసాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది.

English summary
Influential lawmakers and representatives of the American IT industry, including Facebook, have opposed the Trump administration’s proposed plan to withdraw work permits to the spouses of H-1B visa holders, a majority of whom are Indian professionals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X