వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వెళ్తే రిస్క్‌లో పడ్డట్టే... అక్కడి పరిస్థితి బాగా లేదు... అమెరికన్లకు తాజా ట్రావెల్ అడ్వైజరీ.

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కారణంగా విదేశీ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తాజాగా అమెరికా ఎత్తేసింది. దాదాపు 4 నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీలో 50 దేశాల స్టేటస్‌లో ఇప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే,ఆయా దేశాలకు వెళ్లడం రిస్క్‌ చేయడమేనని అమెరికా తమ పౌరులకు సూచిస్తోంది. ఆ దేశాల జాబితాలో చైనాతో పాటు భారత్ కూడా ఉండటం గమనార్హం. కరోనా తీవ్రత రీత్యా భారత్ వెళ్లడం క్షేమం కాదని అమెరికా తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది.

లెవల్ 4 జాబితాలోనే భారత్...

లెవల్ 4 జాబితాలోనే భారత్...

ఈ ఏడాది మార్చి 19న అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ లెవల్ 4-డు నాట్ ట్రావెల్ అడ్వైజరీ పేరుతో అత్యున్నత స్థాయి సూచన ఒకటి విడుదల చేసింది. కరోనా కారణంగా అమెరికన్లు విదేశీ ప్రయాణాలు చేయవద్దని అందులో సూచించింది. తాజాగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఇంకా 50 దేశాలకు మాత్రం క్లియరెన్స్ రాలేదు. ఈ జాబితాలో భారత్ ఇప్పటికీ 'లెవల్ 4' ట్రావెల్ అడ్వైజరీలోనే ఉంది. అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు అమెరికన్లు వెళ్లడం క్షేమకరం కాదని అమెరికా విజ్ఞప్తి చేసినట్లే.

భారత్‌లో పరిస్థితి బాగా లేదని...

భారత్‌లో పరిస్థితి బాగా లేదని...


అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గురువారం(అగస్టు 6) విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో... 'కరోనా కారణంగా భారత్ వెళ్లవద్దు. క్రైమ్,ఉగ్రవాదం కారణంగా భారత్‌లో మరిన్ని చర్యలు చేపడుతున్నారు.' అని పేర్కొనడం గమనార్హం. మరోవైపు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ).. కోవిడ్ 19 తీవ్రతలో భారత్‌కు లెవల్ 3(అత్యవసరం కాని ప్రయాణాలను రద్దు చేసుకోవడం) జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత సందర్శనకు వెళ్తే... సరిహద్దులు మూసివేయడం,విమానాశ్రయాలు మూతపడటం,ప్రయాణాలపై ఆంక్షలు,స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలు,ఎమర్జెన్సీ కండిషన్స్ ఎదురయ్యే పరిస్థితులు ఎదురవుతాయని లెవల్ 3 ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సీడీసీ లెవల్ 3 ఉత్తర్వులు...

సీడీసీ లెవల్ 3 ఉత్తర్వులు...


గ్లోబల్ కోవిడ్ 19 పాండెమిక్‌ నోటీస్‌ పేరుతో సీడీసీ గతంలో లెవల్ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీన్నిబట్టి కొన్ని దేశాల్లో పరిస్థితులు మెరుగవుతాయన్న విషయం స్పష్టమవుతోంది. అయితే భారత్ లాంటి దేశాలపై ఇప్పటికీ లెవల్ 4 ఆంక్షలు కొనసాగించడం... అక్కడ పరిస్థితులు బాగా లేవని అమెరికా భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. తాజా ఉత్తర్వులను అమెరికన్ ప్రజలు దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు సాగించాలని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

Recommended Video

TikTok, WeChat ని బ్యాన్ చేసిన Donald Trump ఇండియా బాటలో అమెరికా, చైనాపై యుద్ధం ఆరంభం ! || Oneindia
ఆంక్షలు ఎత్తేసినా ఇబ్బందులు తప్పవు...

ఆంక్షలు ఎత్తేసినా ఇబ్బందులు తప్పవు...

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విదేశీ ప్రయాణాలకు ఆంక్షలు ఎత్తివేసినా.... ఆయా దేశాల్లో వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అమెరికాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రీత్యా కొన్ని దేశాలు వారిని అనుమతించకపోవచ్చు. జాన్ హోప్కిన్స్ సెంటర్ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. 7,13,000 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో ఒక్క అమెరికాలోనే 4.8మిలియన్ల కరోనా కేసులున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ అమెరికా పౌరులపై ట్రావెల్ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లోకి వచ్చే అమెరికన్లు 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందేనన్న నిబంధన పెట్టింది.

English summary
The US has lifted the highest level of its global health travel advisory for Americans due to the coronavirus pandemic and restored the previous country-specific system without changing the status of over 50 countries, including that of India and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X