వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: 150 ఏళ్ల జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్: బాలిక అత్యాచారం చేసి తరువాత తన అనుచరులను తీసుకు వెళ్లి అదే బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితుడికి రష్యా కోర్టు 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూసెఫ్ అబ్రమోవ్ (58) అనే కామాంధుడు జైలు శిక్షకు గురైనాడని రష్యా పోలీసు అధికారులు తెలిపారు.

ఇతనికి అమెరికా, రష్యన్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. యూసెఫ్ తరచూ రష్యా వెలుతుండేవాడు. రష్యాలో స్కూల్ లో చదివే అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి అక్కడి నుంచి తప్పించుకుని అమెరికా వెళ్లి పోయేవాడు. 2009 జూన్ నెలలో రష్యా వెళ్లాడు. తరువాత 12 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేశాడు.

విషయం బయటకు తెలిస్తే నీతల నరికి ఫుట్ బాల్ ఆడుకుంటానని బాలికను బెదిరించాడు. తరువాత మళ్లీ రష్యా వెళ్లి అదే బాలిక మీద అత్యాచారం చేశాడు. ఇలా మూడు సార్లు బాలిక మీద అత్యాచారం చేశాడు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని యూసెఫ్ కు అనుమానం వచ్చింది.

US man jailed 150 years for abusing girls in Russia

వెంటనే తన అనుచరులను తీసుకు వెళ్లి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యూసెఫ్ ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో యూసెఫ్ ను చూసిన బాలిక నేల మీద కుప్పకూలిపోయింది. శరీరంలో చలనం లేకుండా అల్లాడింది.

యూసెఫ్ నేరం చేశాడని జడ్జి చెప్పారు. నేరం చేసినందుకు నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో మనవి చేశారు. అయితే జడ్జి మాత్రం నిందితుడికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అతను ఇక జైలు నుంచి బయటకు రాలేడని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు ఓ నమ్మకం ఉంటుందని జడ్జి అన్నారు.

English summary
According to the charge sheet, Abramov, who has dual US and Russian citizenship, preyed on schoolgirls during repeated visits to Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X