వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: భర్త ఇక్కడుంటే భార్య మరొకరితో... కోర్టులో భర్తకు భారీ బహుమానం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు పాటు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. ఒకరంటే ఒకరు ఎంతో అన్యూన్యంగా అప్యాయతతో కలిసి జీవించారు. ఉన్నట్లుండి ఆ వ్యక్తికి ఉద్యోగ బాధ్యతలు ఎక్కువయ్యాయి. దీంతో తనకు సమయం కేటాయించడం లేదంటూ తనకు విడాకులు కావాలంటూ కోర్టు గడప తొక్కింది భార్య. భర్త చేసేదేమీ లేక విడాకులకు ఓకే చెప్పాడు. ఇక్కడే అసలు కహానీ మొదలైంది.

 భార్య చేతిలో మోసపోయిన భర్త

భార్య చేతిలో మోసపోయిన భర్త

అమెరికాలోని నార్త్ కారోలినాలో నివాసముంటున్న కెవిన్ హోవార్డ్ అనే వ్యక్తి మంచితనంకు పోయి మోసపోయాడు. తను ఎంతో ఇష్టపడే భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే అప్పుడు కూడా తన భార్య విడాకులు కోరడంతోనే తాను ఇవ్వాల్సి వచ్చింది. పనిభారం ఎక్కువవడంతో తన భార్యకు సమయం కేటాయించలేకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి విడాకులు కోరింది. ఇక చేసేదేమీ లేక హోవార్డ్ విడాకులు ఇచ్చేశాడు. అక్కడ కూడా తన భార్య సుఖంగా ఉండాలనే కోరుకున్నాడు కెవిన్.

ప్రైవేట్ డిటెక్టివ్‌ను ఏర్పాటు చేసిన భర్త

ప్రైవేట్ డిటెక్టివ్‌ను ఏర్పాటు చేసిన భర్త

భార్యకు విడాకులు ఇవ్వడంతో వారి 12 ఏళ్ల వైవాహిక జీవితంకు బ్రేక్ పడింది. ఇక ఆమె దారి ఆమె చూసుకోగా కెవిన్ మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయాడు. తను తన ఉద్యోగం పైనే దృష్టి పెట్టాడు. అయితే తన భార్య ఎందుకు విడిపోయిందో నిజమైన కారణం తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ డిటెక్టివ్ ఇచ్చిన నివేదికతో షాక్ అయ్యాడు కెవిన్.

 డిటెక్టివ్ రిపోర్టుతో షాకైన కెవిన్

డిటెక్టివ్ రిపోర్టుతో షాకైన కెవిన్

కెవిన్ నుంచి విడిపోయిన తన భార్య మరో వ్యక్తితో కలిసి ఉందని డిటెక్టివ్ తెలిపాడు. ఆ వ్యక్తి కూడా ఎవరినో కాదు కెవిన్ సహోద్యోగే కావడం విశేషం. ఇది విని కెవిన్ షాక్ అయ్యాడు. తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి భార్యా భర్తలను విడగొట్టింది తన సహోద్యోగి అని తెలుసుకున్న కెవిన్ జీర్ణించుకోలేక పోయాడు. వెంటనే న్యాయం చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు కెవిన్. తన భార్యపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ సహోద్యోగి తమ ఇంటికి ఎప్పుడూ వచ్చేవాడని వారి సాధకబాధకాలను అతనితో పంచుకున్నామని పిటిషన్‌లో పేర్కొన్నాడు కెవిన్. కానీ పక్కనే ఉంటూ తనకే పోటు పొడుస్తాడని ఊహించలేకపోయినట్లు కెవిన్ చెప్పాడు.

7లక్షల50వేలు డాలర్లు చెల్లించాలంటూ జడ్జి తీర్పు

7లక్షల50వేలు డాలర్లు చెల్లించాలంటూ జడ్జి తీర్పు

ఈ రోజుల్లో నీతి న్యాయం అని చాలామంది మాట్లాడుతారని వాళ్లందరికీ అర్థం కావాలనే తను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు. తమతోనే తిరుగుతూ, తమతోనే మాట్లాడుతూ చివరికి తమకే పోటు పొడిచే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని కెవిన్ చెప్పాడు. ఇక కెవిన్ తరపున వాదించిన లాయరు ఇలాంటి కేసుల్లో చాలామందికి న్యాయం జరిగేలా చూసింది. కెవిన్ విషయంలో కూడా ఆమె గట్టిగా వాదించి జడ్జి కన్విన్స్ అయ్యేలా చూసింది. వాదనలు విన్న జడ్జీ కెవిన్‌కు అన్యాయం జరిగిందని, అతని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి తన భార్యను తనకు కాకుండా చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు న్యాయమూర్తి. అతనికి 7లక్షల50వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.

English summary
US man sued his Wife's lover for his marriage failure and wins 7,50,000 US$.Kevin's coworker had maintained an illegal affair with Kevin's wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X