వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shocking:ఊపిరాడలేదు.. హాస్పిటల్‌కు వెళ్లాడు: ఎక్స్‌-రే బొమ్మ చూస్తే గుండె జారింది..!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి పుట్టింది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.దీంతో ఉన్నఫలంగా నిద్రలేచి హాస్పిటల్‌కు పరుగులు తీశాడు. అక్కడ డాక్టర్లు అతన్ని పరిశీలించి వారు షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తికి వచ్చిన సమస్య ఏంటి..తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే.

గుండెల్లో నొప్పితో బాధపడ్డ బ్రాడ్

గుండెల్లో నొప్పితో బాధపడ్డ బ్రాడ్

మసాచుసెట్స్ నగరంలో బ్రాడ్ గాథియర్ అనే 38 ఏళ్ల వ్యక్తి మంగళవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి హాస్పిటల్‌కు ఉరుకులు తీశాడు. అంతకంటే ముందు నిద్రలేవగానే మంచినీళ్లు తాగేందుకు ప్రయత్నించగా చాలా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో ఊపిరి కూడా సరిగ్గా అందకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ హాస్పిటల్‌లో వైద్యులు పరిశీలించి ముందుగా ఎక్స్‌-రే తీశారు. ఎక్స్‌రేలో ఏదో వస్తువు తన గుండెల్లో అడ్డుకున్నట్లుగా కనిపించింది. ఇక అంతకుముందు నీళ్లు తాగుతుండగా నీళ్లు కడుపులోకి దిగకుండా అక్కడే అడ్డుపడుతూ అతనికి ఇబ్బందిని కలిగించాయి. గొంతులోనే నీళ్లు నిలిచిపోవడంతో పొరపోయినట్లుగా బ్రాడ్ పరిస్థితి తయారైంది.

కనిపించని ఇయర్ బడ్స్

కనిపించని ఇయర్ బడ్స్


అయితే ఎలాగో అలాగా నీళ్లను తాగి ఆ రోజు మొత్తం గడిపేశాడు. అయితే సాయంత్రం నుంచే గుండెల్లో ఒక్కింత నొప్పిని అనుభవించాడు. ఆ రోజు బ్రాడ్ తన ఫోన్‌కు సంబంధించిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కనిపించకపోవడం గమనించాడు. ఆ ఇయర్ బడ్స్ ఖరీదైనందున దానికోసం అతని కుటుంబ సభ్యులు కూడా వెతకసాగారు. అప్పటికే కాస్త ఛాతీ నొప్పి ఉన్నందున ఆ ఇయర్ బడ్స్ మింగడం వల్ల ఆ నొప్పి కలిగిందేమో అని జోకులు కూడా పేల్చారు కుటుంబ సభ్యులు. తన భార్య జోక్ చేసినప్పటికీ ఎందుకో అది నిజమై ఉండొచ్చేమో అన్న అనుమానం కలిగి హాస్పిటల్‌కు వెళ్లాడు.

 ఎక్స్‌రే తీసి చూడగా..

ఎక్స్‌రే తీసి చూడగా..

తన అనుమానం నిజమైంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ ఇయర్ బడ్‌ను మింగేశాడు. అదే తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఎక్స్-రే తీయగానే ఆ ఇయర్ బడ్ తన అన్నవాహికలో ఇరుక్కుపోయినట్లు కనిపించింది. ఇంకేముంది దాన్ని బయటకు తీసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రాత్రి పడుకునేముందు ఆ ఇయర్ బడ్స్‌తోనే బెడ్ ఎక్కాడు బ్రాడ్. అది ఎలానో తన నోట్లోకి వెళ్లింది. నిద్రలో దాన్ని మింగేశాడు. వైద్యులు తమ ప్రయత్నం చేసి ఆ ఇయర్ బడ్‌ను తొలగించారు. తొలగించిన వెంటనే బ్రాడ్ ఆహారం తీసుకున్నాడు. అంతా సవ్యంగా జరిగిపోవడంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే కడుపులో నుంచి బయటకు తీసిన ఆ ఇయర్ బడ్ ఇంకా పనిచేస్తోందని హాస్పిటల్ సిబ్బందితో చెప్పాడు.

English summary
A Massachusets man swallowed wireless ear buds when he was at sleep and found difficulty in breathing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X