• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు

|

భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా మిలిటరీ భారత్ కు మద్దతుగా, బలంగా నిలుస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఎక్కడ ఉన్నాసరే అత్యంత శక్తివంతమైన ఆధిపత్య శక్తిగా ఉన్నామని, చైనానే కాదు మరే దేశం పగ్గాలు చేపట్టలేదని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ మెడోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  US Pledges Military Support to India Amid Border Dispute With China భారత్‌కు అండగా అమెరికన్‌ మిలిటరీ
  చైనాకు చెక్ పెట్టటానికి యూఎస్ సిద్ధం

  చైనాకు చెక్ పెట్టటానికి యూఎస్ సిద్ధం

  భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి సంబంధించి గాని, లేదా మరి ఇక్కడ ఏ విధమైన వివాదం సంభవించినా కానీ అమెరికన్ సైన్యం అత్యంత బలోపేతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.దక్షిణ చైనా సముద్రంలో 2 యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంచరించాయి అన్న వార్త వచ్చిన మూడు రోజుల తర్వాత మెడోస్ ఈ విధంగా స్పందించారు. ఇప్పటికే కరోనా వైరస్ విషయంలోనూ, చైనాతో వాణిజ్యంలోనూ, తాజాగా హాంకాంగ్ విషయంలోనూ అన్ని వ్యవహారాల్లో చైనాతో యు.ఎస్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. చైనాకు చెక్ పెట్టాలని చూస్తోంది.

   అవసరం అయితే ఇండియాకు మద్దతుగా చైనాతో అమెరికా వార్

  అవసరం అయితే ఇండియాకు మద్దతుగా చైనాతో అమెరికా వార్

  ఈ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో రెండు యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ లు సంచరించడం ఉద్రిక్తతలకు చిహ్నంగా చైనా ఆరోపించింది. ఆ చర్యతో ఇండో-పసిఫిక్కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది యూఎస్ .అవసరం అనుకుంటే చైనాతో పోరాటానికి భారత్ కి మద్దతుగా యూఎస్ నిలుస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

  ఇండియా పక్షాన నిలుస్తామని వెల్లడి

  ఇండియా పక్షాన నిలుస్తామని వెల్లడి

  ఇప్పటికే ఇండియా బాటలో చైనా టిక్ టాక్ తో సహా, చైనీస్ యాప్ లను నిషేధించింది. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి నిర్ణయం తీసుకున్న యూఎస్, ఒకవేళ నిజంగా యుద్ధమే వస్తే ఇండియా పక్షాన చైనాపై దూకుడు చూపించనుంది అన్న విషయం వైట్ హౌస్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో ఇట్టే అర్థమవుతుంది. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో పాంగోంగ్ త్సో, గాల్వన్ వ్యాలీ మరియు గోగ్రా హాట్ స్ప్రింగ్‌తో సహా తూర్పు లడఖ్‌లోని పలు ప్రాంతాల్లో భారతదేశం చైనా ల మధ్య నెలకొన్న ఎనిమిది వారాల ప్రతిష్టంభన ముగిసేలా కనిపిస్తుంది.

  వెనక్కు తగ్గుతున్న చైనా .. ఇదీ ఒక కారణమా ?

  వెనక్కు తగ్గుతున్న చైనా .. ఇదీ ఒక కారణమా ?

  లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖపై ఉద్రిక్తతలు తగ్గి చైనా మరియు భారత దళాలు గాల్వన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద జూన్ 15 ఘర్షణ జరిగిన ప్రదేశం నుండి 1.8 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళాయి. కార్ప్స్ కమాండర్ స్థాయిలో సమావేశంలో నిర్ణయించిన మేరకు దశలవారీగా సైన్యం ఉపసంహరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా కాదని ఇండియా తో యుద్ధానికి వస్తే ఇండియాకు మద్దతు పలకడానికి చాలా దేశాలు, బలమైన దేశాలు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం.

  English summary
  The US military will continue to stand strong in relationship to a conflict between India and China or anywhere else. The message is clear. We're not going to stand by and let China or anyone else take the reins in terms of being the most powerful, dominant force, whether it's in that region or over here," Meadows said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more