వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో దారుణం: సీనీ ఫక్కీలో భయానక హత్యలు -పోలీసుల ఫైరింగ్‌పైనా అనుమానాలు

|
Google Oneindia TeluguNews

''అసలే ఎన్నికల టెన్షన్.. టీవీలో సీరియస్ గా వార్తలు చూస్తున్న నాకు.. సడన్ గా తుపాకి పేలుడు శబ్దం వినిపించింది.. నిమిషం వ్యవధిలోనే నాలుగైదు రౌండ్ల కాల్పులు.. వెంటనే ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశాను''అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈసారి ఫైర్ చేసింది పోలీసులు. గంటలు గడుస్తున్నా ఈ ఘటన వెనకున్న కారణాలు గానీ, ఎవరి బుల్లెట్లు తగిలి ఎవరు చనిపోయారనే విషయాన్ని పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది..

ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..

నెవెడా కాల్పుల్లో నలుగురి మృతి

నెవెడా కాల్పుల్లో నలుగురి మృతి

అమెరికా పశ్చిమాన ఉండే నెవడా రాష్ట్రంలోని హెంర్సన్ సిటీలో భయానక కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సిటీలోని స్టోన్ లేక్ అవెన్యూ ప్రాంతంలో మూడంతస్తుల అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో నివసిస్తోన్న కుటుంబసభ్యులు కాల్పులకు బలయ్యారు. ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళ, ఆమె కొడుకు(12ఏళ్లు), మరో మహిళ (30), అనుమానిత హంతకుడు(38) చనిపోయారు. మహిళ కూతరు(16ఏళ్లు) తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పుల సంఘటనలపై పోలీసులు చెప్పిన వివరాలివి..

 అతను పై పోర్షన్ లో ఉంటాడు..

అతను పై పోర్షన్ లో ఉంటాడు..

కాల్పుల్లో చనిపోయిన మహిళకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మంగళవారం ఘటన జరిగిన సమయంలో పెద్ద కొడుకు, భర్త ఇంట్లో లేరు. అపార్ట్మెంట్ లో వాళ్ల పై పోర్షన్ లో ఉండే వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి వెళ్లేసరికి... ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారని, బుల్లెట్ గాయాలతో 16 ఏళ్ల పాప ప్రాణాలతో కనిపించిందని, వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని సెర్చ నిర్వహించామని, కాల్పులు జరిగిన అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేసులో అనుమానితుడు కనిపించాడని వివరించారు. కాగా..

 కాల్చేసిన హంతకుడు

కాల్చేసిన హంతకుడు

ఇంట్లో ముగ్గురిని కాల్చేసిన హంతకుడు.. మహిళ కొడుకు(12)ను బందీగా చేసుకుని, కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడని, తాము చుట్టుముట్టడంతో పిల్లాడి తలకు గన్ గురిపెట్టాడని పోలీసులు తెలిపారు. లొంగిపోవాలని పలు మార్లు ఆదేశించినా వినిపించుకోలేదని, చివరికి కాల్పుల్లో బాలుడు సహా హంతకుడు కూడా చనిపోయాడని పేర్కొన్నారు. అయితే బాలుణ్ని చంపేసింది అనుమానితుడేనా? పోలీస్ బుల్లెట్లు తగలడం వల్ల చనిపోయాడా? అనే ప్రశ్నకు పోలీసులు సమాధానం దాట వేశారు. కాల్పుల సమయంలో పోలీసులు బాడీ కెమెరాలు ధరించి ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో ఆ ఫుటేనీని విడుదల చేస్తామని చెప్పారు. అనుమానితుడు ఈ హత్యలు ఎందుకు చేశాడో, కుటుంబంతో కలిసుండి, చనిపోయిన ఆ రెండో మహిళ ఎవరన్నదీ ఇంకా తెలియాల్సి ఉంది.

నిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామనిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామ

English summary
A Draper mom and son are among four people who were killed in a shooting in Henderson, Nevada on Tuesday. On Wednesday, the police released additional details about the episode, including the circumstances in which they fired at the gunman, who they believed had taken the boy hostage after killing two women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X