వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ షోలో డేంజరెస్ ఫీట్!: అనకొండ పొట్టలో గంటసేపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాకు చెందిన పాల్ రోసోలీ అనకొండ పొట్టలోకి వెళ్లి గంటసేపు ఉన్నాడు. అనకొండ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము. ఇది మనిషిని ఊపిరాడకుండా చేసి చంపుతుంది, మింగేస్తుంది. ఇలాంటి పాముతో పాల్ రోసోలి డేంజరెస్ ఫీట్ చేశాడు.

20 అడుగుల పొడవైన పెద్ద అనకొండ పొట్టలోకే వెళ్ళిపోయాడు. ఓ గంటసేపు ఉండి బయటకు వచ్చాడు. ఈ కార్యక్రమం ఆదివారం డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమైంది. కోట్లాది మంది దీనిని తిలకించారు. ఒక ప్రత్యేకమైన కార్బన్ ఫైబర్ సూట్ ధరించి పాల్ రొసోలీ ఈ ఫీట్ చేశారు.

 US naturalist Paul Rosolie swallowed alive by anaconda for TV show

తొలుత రొసోలీని మింగేందుకు అనకొండ ఆసక్తి చూపలేదట. తప్పించుకొని పోతుంటే అనకొండను రెచ్చగొట్టి మరీ మింగేందుకు ముందుకువచ్చేలా చేశారని తెలుస్తోంది. అధునాతన సమాచార వ్యవస్థ, వీడియో కెమెరాలు తీసుకొని రొసోలీ అనకొండ కడుపులోకి వెళ్ళాడు.

ఆ తర్వాత అనకొండకు హాని జరగకుండా తాను ఎలా బయటకు వచ్చానన్న విషయాన్ని రొసోలీ వెల్లడించలేదు. అనకొండ క్షేమంగానే ఉందని చెప్పాడు. పెటా ప్రతినిధులు మాత్రం ప్రదర్శన కోసం ఓ మూగజీవాన్ని హింసించారని నిరసన తెలిపారు. 'ఈటెన్ ఎలైవ్' పేరిట ఈ షో 10వ తేదీన స్వీడన్, ఫైన్ ల్యాండ్, డెన్మార్క్ తదితర దేశాల్లో, 12న ఆస్ట్రేలియాలో, ఆ తర్వాత భారత్, చైనాలలో బ్రాడ్ కాస్ట్ కానుంది.

English summary
When naturalist Paul Rosolie wanted to focus attention on the destruction of the Amazon rainforest, he decided he needed a stunt guaranteed to get people looking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X