వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ కుమారుడిపై కన్నేసిన అమెరికా: సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి

|
Google Oneindia TeluguNews

వాష్టింగ్టన్: భయానక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడిపై అమెరికా కన్నేసింది. అతని కోసం అన్వేషణ మొదలు పెట్టింది. తన తండ్రి లాగే భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే అవకాశం ఉందని భావిస్తోన్న అగ్రరాజ్యం అమెరికా, ప్రారంభ దశలోనే తుద ముట్టించాలని నిర్ణయించుకుంది. దీనికోసం అతనిపై భారీ రివార్డును ప్రకటించింది. లాడెన్ కుమారుడు ఎక్కడున్నాడనే పక్కా సమాచారాన్ని ఇచ్చిన వారికి మిలియన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది అమెరికా. మిలియన్ డాలర్లు అంటే మనదేశ కరెన్సీలో దీని విలువ ఏడు కోట్ల రూపాయల పైమాటే.

హమ్జా బిన్ లాడెన్.. నెట్ వర్క్ బలోపేతం

వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేసి, అమెరికాను వణికించిన భయానక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్. ప్రస్తుతం దాదాపు నిద్రాణ స్థితిలో ఉన్న అల్ ఖైదాకు హమ్జా బిన్ లాడెన్ నాయకత్వం వహిస్తున్నాడు. క్రమంగా తన నెట్ వర్క్ ను పెంచుకుంటున్నాడు. ఈ విషయం అమెరికా దృష్టికి చేరింది. అమెరికా నౌకాదళానికి చెందిన సీల్స్.. పాకిస్తాన్ లోని అబోట్టాబాద్ లో లాడెన్ ను హతమార్చాయి. అతని ఇంటిపై దాడి, కాల్చి చంపాయి. అనంతరం లాడెన్ మృతదేహాన్ని పసిఫిక్ మహాసముద్ర గర్భంలో గుర్తు తెలియని ప్రదేశంలో పూడ్చి పెట్టాయి.

ఉగ్రవాది మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ధృవీకరించిన పాక్ విదేశాంగ మంత్రి: అనుమానాలెన్నోఉగ్రవాది మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ధృవీకరించిన పాక్ విదేశాంగ మంత్రి: అనుమానాలెన్నో

US Offers $1 Million Reward to find Osama Bin Laden’s Son

అనంతరం అల్ ఖైదా క్రమంగా తన పట్టును కోల్పోయింది. దాదాపుగా నిద్రాణ స్థితికి చేరుకుంది. 2011లో లాడెన్ హతమయ్యే సమయానికి హమ్జా వయస్సు 22 సంవత్సరాలకు అటు, ఇటుగా ఉంటుందని అమెరికా అంచనా వేసింది. ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఈ మధ్యకాలంలో అతను అల్ ఖైదాపై తన పట్టు పెంచుకున్నాడని భావిస్తోంది. భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది.

US Offers $1 Million Reward to find Osama Bin Laden’s Son

హమ్జా ఎక్కడున్నట్టు?

ప్రస్తుతం హమ్జా ఎక్కడున్నాడు? ఏ దేశంలో నివసిస్తున్నాడనే విషయంపై అమెరికాకు కూడా స్పష్టత లేదు. లాడెన్ నివసించిన పాకిస్తాన్ గానీ, అల్ ఖైదా నెట్ వర్క్ బలంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఉండొచ్చని అనుమానిస్తోంది అమెరికా. సిరియాలో కూడా తలదాచుకునే అవకాశాలు లేకపోలేదని, ఇరాన్ లో గృహ నిర్బంధంలో ఉండొచ్చని అభిప్రాయపడుతోంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చడానికి విమానాలను హైజాక్ చేసిన అల్ ఖైదా ఉగ్రవాది మహమ్మద్ అట్టా కుమార్తెను అతను పెళ్లాడినట్లు ధృవీకరించింది.

English summary
The United States on Thursday offered a $1 million reward for information on a son of late al-Qaeda leader Osama bin Laden, seeing him as an emerging face of extremism. The location of Hamza bin Laden has been the subject of speculation for years with reports of him living in Pakistan, Afghanistan, Syria or under house arrest in Iran. “Hamza bin Laden is the son of deceased former AQ leader Osama bin Laden and is emerging as a leader in the AQ franchise,” a State Department statement said, referring to al-Qaeda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X