• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సైనికచర్య ద్వారా వెనెజులా అధ్యక్షుడిని గద్దె దింపేందుకు అమెరికా ప్రయత్నం..?

|

వెనెజులా: వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మడురోని గద్దె దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందులో అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఉందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అధ్యక్షుడు నికోలస్‌ను గద్దెదింపేందుకు సహకరించాలని వెనెజులా సైన్యాధికారులు అమెరికా ఉన్నతాధికారులతో రహస్యంగా భేటీ అయి చర్చలు జరిపారని ప్రస్తుత అమెరికా అధికారులు, పదవీవిరమణ చేసిన అధికారులు కూడా స్పష్టత ఇచ్చారు. ఇది ట్రంప్ కనుసన్నుల్లోనే జరిగిందని వారు తెలిపారు.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు సత్యసాయిబాబా భక్తుడు

అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా సైన్యాధికారులతో గతేడాదిగా పలుమార్లు భేటీ అయ్యారని అధ్యక్షుడు నికోలస్ మడురోను గద్దె దింపేందుకు సహకరించాలని పలుమార్లు వెనెజులా సైన్యాధికారులు అమెరికా అధికారులను కోరారని అయితే అమెరికా ఇందుకు నిరాకరించిందని ఒక అమెరికా అధికారి వెల్లడించారు. ఈ అంశం ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చింది. అయితే దీనిపై స్పందించేందుకు వైట్‌హౌజ్ నిరాకరించింది.అయితే వెనెజులాలో శాంతియుతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు అమెరికా మద్దుతు ఇస్తుందని తెలిపింది.

US officialshad secret meetings with Venezuela officials plotting a coup againt Maduro

ఇదిలా ఉంటే వెనెజులాలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే అధ్యక్షుడు నికోలస్ మడురోను గద్దెదింపాల్సిందేనని ఇందుకోసం మిలటరీని వినియోగించుకోవాలని అమెరికా అధ్యక్షుడు గతవారమే వ్యాఖ్యానించారు. ఆగష్టు 2017లోనే వెనెజులాపై దండెత్తేందుకు ఉన్న అవకాశాలపై ట్రంప్ ఆరాతీసినట్లు సమాచారం. అమెరికా సహకారంతో మడురో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు చేసినట్లు సమాచారం. మొత్తం 11 రహస్య భేటీలు జరిగాయని తెలుస్తోంది. సైనిక చర్య ద్వారా మడురోను గద్దెదింపేందుకు చాలా మంది ప్రయత్నించారని ఇందులో భాగంగా అమెరికాతో వెనెజులా దేశ రహస్యాలు ఏమేరకు చేరవేశారనేదానిపై స్పష్టత లేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఒకప్పుడు లాటిన్ అమెరికా దేశాల్లో వెనెజులానే అత్యంత ధనికమైన దేశంగా ఉండేది. నేడు ఆదేశ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తినడానికి తిండి కూడా దొరకడం కష్టమవుతుండటంతో ఆదేశ ప్రజలు పొరుగుదేశాలకు వలసపోతున్నారు. అక్కడి ప్రజలకు జబ్బులు చేసి హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు రాజకీయ అస్థిరత్వం ఆదేశాన్ని వెంటాడుతోంది. గతనెల ఆదేశ అధ్యక్షుడు మడురోపై హత్యాయత్నం జరిగింది. తను ఒక బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తుండగా ఆయనపైకి డ్రోన్స్ దూసుకొచ్చాయి. వాటిలో పేలుడు పదార్థాలున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US officials met secretly with Venezuelan military officers who were plotting a coup against Venezuelan President Nicolas Maduro, both a current and a former US official confirmed to CNN.American officials met with the renegade Venezuelan military officers several times over the last year after the Venezuelan officers made contact, but Washington ultimately decided against supporting the coup, the two sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more