• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా సాకు- 12 సంస్ధలు, ఒప్పందాలకు అమెరికా గుడ్ బై - అక్బరుద్దీన్ ట్వీట్ కలకలం....

|

కరోనా వేళ ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కీలక సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో పెద్దన్న తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా... తాజాగా భారత మాజీ దౌత్యవేత్త అక్బరుద్దీన్ కూడా తన ట్విట్టర్ లో ఇదే అంశంపై ట్రంప్ ను సూటిగా ప్రశ్నించారు. దీంతో ఆ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

కరోనా గురించి ఒళ్లు జలదరించే నిజం: బ్రెయిన్ డ్యామేజ్‌..నిర్వీర్యం: లండన్ వర్శిటీ పరిశోధనల్లో

 అమెరికాపై కరోనా...

అమెరికాపై కరోనా...

చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఓ రకంగా చెప్పాలంటే అందరి కంటే ఎక్కువగా వణుకుతున్నది అమెరికానే. ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలి, మార్గదర్శనం చేయాలి. కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కానీ కరోనా విషయంలో ముందునుంచీ అసహనంగా ఉన్నట్లు ట్రంప్ కనిపిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించినా అమెరికాలో మాత్రం ఆలస్యంగా లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా ట్రంప్ వ్యాఖ్యలు రోజుకో రకంగా కలకలం రేపుతున్నాయి. ఇవి ప్రజల్లో భరోసా నింపడానికి బదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొత్త కష్టాలు తెస్తున్నారని జనం ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 12 సంస్ధలు, ఒప్పందాలకూ గుడ్ బై...

12 సంస్ధలు, ఒప్పందాలకూ గుడ్ బై...

కరోనా విపత్తు వేళ పలు అంతర్జాతీయ సంస్ధలతో పాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్ధలతో మరింత విస్తృతంగా పనిచేయాల్సింది పోయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగాలన్న ఆయన నిర్ణయం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అసలు కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి దాన్ని అడ్డుపెట్టుకుని ప్రపంచ దేశాలతో, అంతర్జాతీయ సంస్ధలతో మరింత దూరం జరగాలన్న ట్రంప్ నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గతంలో పలు సందర్భాల్లో అంతర్జాతీయ సంస్ధలతో కుదిరిన ఒప్పందాల నుంచి కూడా ట్రంప్ వైదొలగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

  US Announces Visa Restrictions On Chinese Officials | టిబెట్ యాక్ట్ ప్రయోగం || Oneindia Telugu
   ప్రపంచ ఆరోగ్య సంస్ధకూ గుడ్ బై... అక్బరుద్దీన్ ట్వీ్ట్...

  ప్రపంచ ఆరోగ్య సంస్ధకూ గుడ్ బై... అక్బరుద్దీన్ ట్వీ్ట్...

  కరోనా మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్ధ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి కూడా అమెరికా తప్పుకోనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో కరోనాను కూడా పట్టించుకోకుండా 12 అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలగడంపై మాజీ భారత దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ చేసిన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ లో అక్బరుద్దీన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి నేరుగా సూటి ప్రశ్న వేశారు. ఇప్పటికే మీరు కరోనా కేసులు పెరుగుతున్న వేళ 12 సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగిగారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి తప్పుకుంటామంటున్నారు. నిజంగానే తప్పుకుంటారా అంటూ అక్బరుద్దీన్ ట్రంప్ ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్ మరింత ఇరుకునపడ్డారు. ఇప్పటికే పలు సాకులతో అంతర్జాతీయ సంస్ధల నుంచి అమెరికాను తప్పిస్తున్న ట్రంప్ వైఖరిని తన తాజా ట్వీట్లో అక్బరుద్దీన్ బహిర్గతం చేయడం ఆసక్తి రేపుతోంది.

  English summary
  Questioning the position of global order, former Indian diplomat Syed Akbaruddin posted an article on Twitter that stated that US had pulled of 12 bodies/treaties amid a rising number of coronavirus cases.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more