వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 లక్షలు దాటిన మరణాలు: వ్యాక్సిన్‌పై ట్రంప్ గంపెడశాలు, తిప్పికొడుతోన్న జో బిడెన్..

|
Google Oneindia TeluguNews

మరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచార పర్వంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అయితే కరోనా వైరస్ మాత్రం వారిని తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రచారం సంగతి దేవుడెరుగు.. కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ అంశం అమెరికా అధ్యక్ష అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రచార పర్వంలో ప్రజలకు ఏం చెప్పాలనే అంశంపై సందిగ్దత నెలకొంది.

 2 లక్షలు దాటిన మరణాలు..

2 లక్షలు దాటిన మరణాలు..

జాన్ హోప్కిన్స్ వర్సిటీ అంచనా ప్రకారం.. అమెరికాలో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 5కి చేరుకుంది. అలాగే వైరస్ నిర్ధారణ జరిగిన వారి సంఖ్య 6.86 మిలియన్లు దాటింది. ఇక ప్రపంచంలోనే కరోనా వైరస్ మరణాలు అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బ్రెజిల్ లక్ష 37 వేలకు పైగా.. ఇండియా 88 వేలకు పైగా ఉన్నాయి. ప్రపంచంలో 4 శాతం కరోనా మరణాలు అమెరికాలో ఉన్నాయి. ఇదీ అమెరికా జనాభాలో 20 శాతం అని నిపుణులు తెలిపారు. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కఠిన పరీక్షను ఎదుర్కొనబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రంప్ విఫలం...?

ట్రంప్ విఫలం...?

కరోనా వైరస్ నివారణలో ట్రంప్ విఫలమయ్యారని విపక్ష అభ్యర్థి జో బిడెన్ ఆరోపించారు. గత ఆరు నెలల నుంచి అబద్దాలు చెబుతూ కాలం వెళ్తదీస్తున్నారని మండిపడ్డారు. ఓ సమర్థ నేత వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో అధ్యక్ష మార్పు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. అదే తనకు శ్రీరామ రక్ష అవుతోందని ధీమాతో ఉన్నారు.

Recommended Video

IPL 2020: Hyderabad Fans Response | Oneindia Telugu
ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్

ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్

వ్యాక్సిన్ పంపిణీ చేసి.. వైరస్‌ను అంతం చేస్తామని ట్రంప్ ధీమతో ఉన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. కరోనా వైరస్ సందర్భగా నేతలంతా వర్చువల్ విధానంలో వీడియో సందేశం ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌కు వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
United States registered its 200,000th death from the Covid-19 pandemic on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X