వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైలట్‌కి నచ్చలేదని భారతీయుడ్ని విమానం దించేశారు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పైలట్‌కు నచ్చలేదని ఓ సిక్కును, అతని స్నేహితులైన ముగ్గురు ముస్లింలను విమానం నుంచి దించేశారు. దీన్ని అవమానంగా భావించిన వారు విమాన సిబ్బందిపై 9 మిలియన్‌డాలర్లకు పరువు నష్టం కేసు పెట్టారు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది.

డిసెంబర్ నెలలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం టొరంటో నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల్లో ఒక సిక్కుతో పాటు బంగ్లాదేశ్‌, అరబ్‌కి చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

US pilot throws out Sikh, three Muslims from flight

విమానం ఎక్కగానే సిక్కు ప్రయాణికుడు తన స్నేహితుడైన ముస్లిం ప్రయాణికులతో కూర్చుందామనుకుని తోటి ప్రయాణికులని రిక్వెస్ట్‌ చేసి సీటు మార్పించుకుని కూర్చున్నారు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఎయిర్‌హోస్టెస్‌ వచ్చి నలుగురినీ కిందకి దిగమంది.

ఎందుకు అని అడిగితే మర్యాదగా దిగి గేట్‌ వద్ద వెయిట్‌ చేస్తే ఆ తర్వాత ఏం చేయాలో సిబ్బందే చెప్తారంటూ కాస్త కఠినంగా మాట్లాడింది. వారి జాతి, రంగు ఏమాత్రం పైలట్‌కి, విమాన సిబ్బందికి నచ్చలేదని అందుకే దింపేసినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై నలుగురు ప్రయాణికులూ కలిసి ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై బుధవారం కోర్టులో 9 మిలియన్‌ డాలర్లకు దావా వేశారు.

English summary
Sikh man along with his three Muslim friends, who were kicked out from Republic Airways, an American airlines flight, because their appearance made the captain uneasy, are seeking $9 million in compensation from the airline in a lawsuit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X