వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గత రెండు వారాలుగా ప్రపంచంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పట్టి పీడిస్తున్న గేమ్ 'పోకేమాన్ గో'. ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందిన ఈ గేమ్‌లో న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి చివరి స్టేజి వరకూ వెళ్లిపోయాడు. నార్త్ అమెరికన్ వర్షన్‌కు చెందిన ఈ గేమ్ మొట్టమొదటి అమెరికాలో విడుదలైంది.

అంతేకాదు ట్విట్టర్ టిండర్ తదితర యాప్‌ల కన్నా అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్ కూడా ఇదే. బ్లూక్లిన్‌కు చెందిన నిక్ జాన్సన్ (28) అనే వ్యక్తి ఈ గేమ్‌లో 142 పోకేమాన్ లనూ పట్టేసుకున్నానని చెబుతూ సోషల్ మీడియా రెడ్డిట్‌లో ఓ పోస్టు పెట్టాడు. యాప్‌లోని 'పోకేడెక్స్' సెక్షన్లో తాను పట్టుకున్న 142 పోకేమాన్‌లను చూపించాడు.

నిజానికి ఈ 'పోకేమాన్ గో' గేమ్‌లో మరో 11 పోకేమాన్‌‌లు ఉంటాయట. ఈ పదకొండులో మిస్టర్ మైమ్, కంగష్ ఖాన్, ఫార్ ఫెచ్డ్ అనే పేరున్న పోకేమాన్‌లను ఇతర దేశాల్లో పట్టి బంధించాలట. మిగిలిన ఆరు పోకేమాన్‌లూ ఎక్కడ ఉంటాయో ఈ గేమ్‌ను రూపొందించిన నింటెండోనే ప్రకటించలేదు.

 సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

కాలిఫోర్నియాలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన నిక్ సీటీవీ న్యూస్ ఛానెల్‌కు సోమవారం ఇంటర్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు ఈ పోకేమాన్‌ గేమ్‌లంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. నిటెండో గేమ్ బాయ్‌గా తాను ఆడిన సమయంలో పోకేమాన్ రెడ్, బ్లూగా ఉన్నాడని తెలిపాడు.

 సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

ఈ పోకేమాన్‌లను రోజుకు 8 గంటల పాటు శ్రమించి మాన్‌‍హట్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో వెతికి పట్టుకున్నట్టు వెల్లడించాడు. సరాసరిన ప్రతి రోజు 8 మైళ్లు నడుస్తూ, రెండు వారాల పాటు శ్రమించానని చెప్పాడు. తన ప్రయాణంలో తన గర్ల్‌ప్రెండ్ ఎంతో మద్దతుగా నిలిచిందని చెప్పాడు.

 సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

తన కలెక్షన్‌లోని భాగాల కోసం ఒకానొక సమయంలో న్యూజెర్సీకి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌కు కూడా ఫోన్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. తన తొలి పోకేమాన్ 'స్క్వయిర్టిల్' అని, చివరిగా తాను 'ఒమాస్టార్'ను పట్టుకున్నానని చెప్పాడు. ఓ పోకేమాన్ కోసం న్యూయార్క్ కూడా ప్రయాణించానని తెలిపాడు.

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

సెన్సేషన్ గేమ్: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి ఇతడే

ట్రావెల్ వెబ్‌సైట్ మారిట్ రివార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానని యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఉన్న పోకేమాన్‌ల కోసం త్వరలోనే బయల్దేరనున్నట్లు తెలిపాడు.

English summary
Every evening for two weeks, Nick Johnson walked nearly 13 kilometres around New York City in search of elusive Pokemon, and it seems his persistence and late nights paid off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X