వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైర్ అమెరికన్స్: హెచ్1-బీ విసా హోల్డర్లకు ఫ్రెష్‌గా షాక్ ఇచ్చిన ట్రంప్: హైలీ టాలెంటెడ్లకే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు మరో షాక్ ఇచ్చింది అమెరికా. హెచ్1-బీ విసాలను జారీ చేయడంపై మరోసారి నిషేధాస్త్రాన్ని ప్రయోగించింది. హెచ్1-బీ విసాల ద్వారా అమెరికా ఫెడరల్ ఏజెన్సీల్లో చేపట్టబోయే నియామకాలను నిషేధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. హెచ్1-బీ విసాలతో పాటు విదేశీయులకు జారీ చేయాల్సిన వర్క్ విసాలను సస్పెండ్ చేస్తూ రెండు నెలల కిందట ఆదేశాలను జారీ చేసిన అమెరికా.. తాజాగా ఫెడరల్ ఏజెన్సీల్లో హెచ్1-బీ విసాల ద్వారా జారీ చేసే కాంట్రాక్టు నియామకాలను నిలిపివేశారు.

నిన్న ముఖ్యమంత్రి..నేడు మాజీ ముఖ్యమంత్రి: సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్: కర్ణాటకలో కట్టుతప్పినిన్న ముఖ్యమంత్రి..నేడు మాజీ ముఖ్యమంత్రి: సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్: కర్ణాటకలో కట్టుతప్పి

 అమెరికన్ల కోసమే..

అమెరికన్ల కోసమే..

తమ దేశానికి చెందిన పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పౌరులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఈ మూడు నెలల వ్యవధిలో సుమారు రెండున్నర కోట్ల మందికి పైగా అమెరికా యువత ఉద్యోగాలను కోల్పోయారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. వారికి ఉపాధిని కల్పించడానికి ఫెడరల్ ఏజెన్సీల్లో జారీ చేసే కాంట్రాక్టు పనుల్లో హెచ్1-బీ విసాల జారీని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

భారతీయ ఐటీ నిపుణులకు తలుపులు మూసేసినట్టే..

భారతీయ ఐటీ నిపుణులకు తలుపులు మూసేసినట్టే..

తాజాగా ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన నిషేధం ప్రకారం.. కిందటి నెల 24వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. జులై 24వ తేదీ నుంచి జారీ చేసే హెచ్1-బీ విసాలన్నింటినీ ఈ నిషేధం పరిధిలోకి తీసుకొచ్చింది. దీని ప్రభావం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏజెన్సీల నుంచి కాంట్రాక్టును దక్కించుకునే అనేక ఐటీ కంపెనీల్లో భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు పని చేస్తున్నారు. తాజాగా ఆదేశాల వల్ల ఇకపై ఆయా కంపెనీల్లో హెచ్1-బీ విసాల ద్వారా నియామకాలు ఉండబోవు.

హైలీ టాలెంటెడ్లకే జారీ చేసేలా..

హైలీ టాలెంటెడ్లకే జారీ చేసేలా..

అమెరికన్లకు ఉపాధి కల్పించడానికే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఫెడరల్ ఏజెన్సీల్లో హెచ్1-బీ విసాల ద్వారా చేపట్టబోయే నియామకాలపై నిషేధానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. హైర్ అమెరికన్స్ అనే ఒకే ఒక్క కారణంతో తాను దీనిపై సంతకం చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ వేతనాలకు ఉద్యోగాల్లో చేరుతారనే ఉద్దేశంతో అమెరికన్లను తొలగించి, వారి స్థానంలో విదేశీ నిపుణులను నియమించుకోవడాన్ని సహించబోనని ట్రంప్ తెలిపార

Recommended Video

TikTok బ్యాన్ పై Trump, Microsoft In Talks To Buy TikTok
అమెరికన్ల పొట్ట కొట్టడం సరికాదంటూ..

అమెరికన్ల పొట్ట కొట్టడం సరికాదంటూ..

అమెరికన్ల పొట్ట కొట్టే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని అన్నారు. ఇకపై అత్యున్నత ప్రతిభ ఉన్న వారికి మాత్రమే హెచ్1-బీ విసాలను జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అమెరికన్లకు ఉపాధిని కల్పించే శక్తి సామర్థ్యాలు ఉన్నవారికే పరిమితం చేసేలా నిబంధనలను రూపొదించే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అమెరికన్ల ఉపాధిని పోగొట్టేలా వర్క్ పర్మిషన్ల కోసం వాటిని మంజూరు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు. విదేశీ నిపుణులకు ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నారంటూ టెన్నెస్సె వ్యాలీ అథారిటీ (టీవీఏ) ఛైర్మన్ స్కిమ్ థామ్సన్ ఆరోపణల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
In a major disappointment for Indian IT professionals, US President Donald Trump on Monday signed an executive order banning federal agencies from hiring H1-B visa holders for federal contracts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X