• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా బారిన పడ్డ ట్రంప్‌పై ఏ వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారో తెలుసా? పూర్తిగా నయం: జనం ముందుకు

|

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అమెరికా అధ్యక్షుడువేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని మేరీల్యాండ్‌లోని బేతెస్థలో గల వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ డాక్టర్లు వెల్లడించారు. ఈ ఆసుపత్రిలోనే డొనాల్డ్ ట్రంప్ చికిత్స పొందుతున్నారు.

  Donald Trump పై పని చేసిన COVID-19 Vaccine.. త్వరగా నయం! || Oneindia Telugu

  అప్పుడే ఏమైంది?: అసలు పరీక్ష ముందుంది: ట్రంప్ వీడియో మెసేజ్: మెలానియాపై: అబద్ధాల రాజ్యం

  ఆయనపై ఆ వ్యాక్సిన్ ప్రయోగం..

  ఆయనపై ఆ వ్యాక్సిన్ ప్రయోగం..

  ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆదివారం ఆయన జనం ముందుకు వచ్చారు. ఆసుపత్రి ఆవరణలో తన కాన్వాయ్‌లో కలియతిరిగారు.కరోనా సోకిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. ఆయన వ్యాక్సిన్‌తోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. అదే- రెమ్‌డెసివిర్. డొనాల్డ్‌ ట్రంప్‌నకు రెమ్‌డెసివిర్‌ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు మిలటరీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. తొలి డోసుతో ఆయనపై కరోనా ప్రభావం తగ్గిందని, అనంతరం రెండో డోసును అందించామనీ పేర్కొన్నారు.

  సాధారణ స్థితికి ఆక్సిజన్ శాతం..

  రెండో డోసు రెమ్‌డెసివిర్ వ్యాక్సిన్‌ అందజేసిన తరువాత ట్రంప్ కిడ్నీలు, కాలేయం పని తీరు సాధారణ స్థితికి వచ్చినట్లు స్పష్టం చేశారు. రెండో డోసు అనంతరం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చెప్పారు. ఆయన శరీర ఆక్సిజన్ స్థాయి ఇప్పుడు 98 శాతంగా నమోదైందని తెలిపారు. సోమవారం ఉదయం ఆయనను డిశ్చార్జి చేస్తామని చెప్పారు. డిశ్చార్జి అనంతరం ఆయన కొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వైట్‌హౌస్‌లో ఎలాంటి జాగ్రత్తలను పాటించాల్సఉంటుందనే విషయంపై అవగాహన కల్పించామని అన్నారు.

  ఆసుపత్రి ఆవరణలో జనం ముందుకు..

  తన ఆరోగ్యం మెరుగు పడటంతో డొనాల్డ్ ట్రంప్ జనం ముందుకు వచ్చారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ ఆవరణలో ఆయన తన కాన్వాయ్‌లో కలియతిరిగారు. బ్లాక్ కలర్ ఎస్‌యూవీ కారులో బ్యాక్‌సీట్‌లో కూర్చున్న ట్రంప్.. తనను పలకరించడానికి వచ్చిన మద్దతుదారులకు కారులో నుంచే చేతులు ఊపుతూ కనిపించారు. వారిని ఉత్సాహపరిచేలా చప్పట్లు కొడుతూ ట్రంప్ ఉల్లాసంగా కనిపించారు. 20 నిమిషాల పాటు ట్రంప్.. ఆసుపత్రి ఆవరణలోనే కారులో గడిపారు. ట్రంప్‌ను చూడగానే ఆయన మద్దతుదారులు అమెరికా జాతీయ పతకాన్ని ఊపుతూ.. యూఎస్ఏ అంటూ నినదించారు. ఆ సమయంలో ట్రంప్.. నల్లరంగు మాస్క్‌ను ధరించారు.

  అద్భుత ప్రయాణం.. కోవిడ్ గురించి చాలా తెలుసుకున్నా..

  అద్భుత ప్రయాణం.. కోవిడ్ గురించి చాలా తెలుసుకున్నా..

  కరోనా బారిన పడినప్పటి నుంచి కోలుకోవడం వరకూ తన ప్రయాణం అద్భుతంగా, ఆసక్తికరంగా సాగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణంలో కోవిడ్ గురించి అనేక విషయాలను తెలుసుకోగలిగానని అన్నారు. ఆసుపత్రి వద్ద ఆయన తన మద్దతు దారులను ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. స్కూలుకు వెళ్లే చిన్నపిల్లాడిలా తాను కరోనా వైరస్ గురించి చాలా విషయాలను తెలుసుకోగలిగానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారని, తాను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో చురుకుగా పాల్గొంటానని అన్నారు. గ్రేట్ అమెరికాగా తీర్చిదిద్దడానికి తనకు మరోసారి అవకాశం లభిస్తుందనే విశ్వాసం ఏర్పడిందని చెప్పారు.

  English summary
  US President Donald Trump's medical team says the president has completed a second dose of remdesivir, and his kidney and liver functions were normal. Trump waves at supporters from his car outside Walter Reed National Military Medical Center where he is being treated for COVID-19.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X