వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ స్వీయ క్షమాభిక్ష- ముప్పేట దాడి నుంచి బయటపడే యత్నం- చట్ట సమ్మతమేనా ?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొంతకాలం పాటు మౌనంగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో తనపై గెలిచిన ప్రత్యర్ధి జో బైడెన్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించే వేళ కుట్రలకు పదునుపెట్టారు. బైడెన్‌ గెలుపుని పార్లమెంటు ఆమోదించకుండా అడ్డుకునేందుకు మద్దతుదారులతో క్యాపిటల్‌ భవనంపై దాడికి రెచ్చగొట్టారు. దీంత ఇప్పుడు ట్రంప్‌కు శిక్ష తప్పదనే వాదన వినిపిస్తోంది.

వాస్తవానికి ట్రంప్ ఈ నెల 20 వరకూ అధికారంలో కొనసాగేందుకు అవకాశం ఉంది. ఆ లోపు తాజా పరిణామాలపై బైడెన్‌ టీమ్‌ తనపై చర్యలకు దిగితే ప్రస్తుత అధ్యక్షుడి హోదాలో వాటిని అడ్డుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తనకు తానే క్షమాభిక్ష ప్రకటించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌ నుంచి తప్పుకునే లోపు తనపై ఎలాంటి చర్యలు లేకుండా స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకుంటానని ఆయన సలహాదారులతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

US President Donald Trump considering self-pardon, say sources. What law says

తాజాగా అమెరికాలో అల్లర్ల నేపథ్యంలో మీపై చట్ట పరమైన చర్యలు తప్పవంటూ ట్రంప్‌తో ఆయన న్యాయ సలహాదారు ప్యాట్‌ సిపోలోన్‌ చెప్పారు. మద్దరుదారుల చర్యలకు ట్రంప్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్‌కు తెలిపారు. అదే పరిస్ధితి ఎదురైతే తాను స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకుంటానని ట్రంప్‌ ఆయనతో చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి ట్రంప్‌ వచ్చే రెండువారాల్లో చాలా క్షమాభిక్షలు ప్రకటించాల్సి ఉంది.. వాటితో పాటే ఆయనకూ క్షమాభిక్ష ప్రకటించుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారో, ఇందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తాయో లేదో తేలాల్సి ఉంది. అమెరికాలో న్యాయనిపుణుల వాదన ప్రకారం అయితే ఏ వ్యక్తి కూడా తన కేసులో జడ్డిగా వ్యవహరించడం కానీ, క్షమాభిక్ష ప్రకటించుకోవడం కానీ చేయకూడదని వారు చెబుతున్నారు.

English summary
As per sources, US President Donald Trump has suggested to aides that he wants to pardon himself in the final days of his presidency. But is that legal?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X