వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పాతపాటే: సుప్రీంకోర్టుపైనా డౌట్స్: ఆరునెలలైనా నేనింతే: డొనాల్డ్ ట్రంప్ యూటర్న్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ పాత పాటే పాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను వీడటానికి సిద్ధంగా ఉన్నానంటూ పరోక్షంగా ఎన్నికల ఫలితాలను అంగీకరించినట్లు కనిపించిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. జో బిడెన్ గెలుపును అంగీకరించడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఈ సారి కొత్తగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా అనుమానాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల అక్రమాలపై దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తుందనే నమ్మకం తనకు లేదని తేల్చి చెప్పారు.

Recommended Video

US Election 2020:అధికార బదిలీ చేయాల్సివస్తే... చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేస్తున్నాం!-White House
ఎన్నికల ఫలితాల తరువాత తొలి టీవీ ఇంటర్వ్యూలో

ఎన్నికల ఫలితాల తరువాత తొలి టీవీ ఇంటర్వ్యూలో

ప్రముఖ న్యూస్ ఛానల్ ఫాక్స్ న్యూస్‌కు ఆయన ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఆనేక విషయాలను డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. ఫాక్స్ న్యూస్ ఛానల్ టాప్ యాంకర్ మారియా బార్టిరోమో ఆయనను ఇంటర్వ్యూ చేశారు. దాదాపు ఇంటర్వ్యూ మొత్తం ఎన్నికల ఫలితాల చుట్టే తిరిగింది.

మాస్ బ్యాలెట్ ఫ్రాడ్..

మాస్ బ్యాలెట్ ఫ్రాడ్..

ఇదివరకు ప్రస్తావించిన అంశాలనే ట్రంప్ ఈ ఇంటర్వ్యూలోనూ పునరుద్ధాటించారు. బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ కారణంగానే తాను మెజారిటీ రాష్ట్రాలను కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రిపబ్లికన్లకు గట్టిపట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ మెజారిటీని కోల్పోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. విస్కాన్సిన్, అరిజోనా, జార్జియా, మిన్నెసోటా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో మెజారిటీని కోల్పోయిన అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థను మానిప్యులేట్ చేశారని ఘాటు విమర్శలను సంధించారు.

విచారిస్తోందనే నమ్మకం లేదంటూ..

విచారిస్తోందనే నమ్మకం లేదంటూ..

ఎన్నికల్లో చోటు చేసుకున్న మోసాలకు తగిన సాక్ష్యాధారాలను తన లీగల్ టీమ్ సేకరించిందని, వాటిని సుప్రీంకోర్టుకు అందజేసిందని చెప్పారు. తాము దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుందనే విశ్వాసం కలగట్లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాము వేసిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానాలు తోసిపుచ్చుతున్నాయని, పెన్సిల్వేనియా న్యాయస్థానంలోనూ తిరస్కరణకు గురైన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన మద్దతుదారులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించడానికి న్యాయమూర్తులు సుముఖంగా లేరని ఆరోపించారు.

సుప్రీంకోర్టు ఉండీ ఉపయోగం

సుప్రీంకోర్టు ఉండీ ఉపయోగం

తన మద్దతుదారులు దాఖలు చేసిన కేసులను సుప్రీంకోర్టు తప్పనిసరిగా విచారణకు స్వీకరించాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. తగినన్ని సాక్ష్యాధారాలను అందజేసినప్పటికీ.. విచారించడానికి ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు ఉన్నా విచారించకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు అర్థం లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆరు నెలల్లో తన మనసు మారుతుందని అందరూ భావిస్తున్నారని, ఆ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్‌ను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని అన్నారు.

English summary
US President Donald Trump on Sunday said that it might be difficult to get his election fraud allegations heard before the Supreme Court, expressing doubt about his legal strategy as his hopes of overturning the Nov. 3 election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X