వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యూహెచ్‌వోతో కటీఫ్, చైనా నియంత్రణలో ఉంది, నిధులు ఇతర సంస్థలకు మళ్లిస్తాం:ట్రంప్

|
Google Oneindia TeluguNews

గత కొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా మైత్రీపై గుస్సామీదున్న.. పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక ప్రకటన చేశారు. డబ్ల్యూహెచ్‌వోతో అమెరికా తన సంబంధాలను తెంచుకుంటుందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం డబ్ల్యూహెచ్‌వో చైనా మాట వినడమేననితెలుస్తోంది. తాము డబ్ల్యూహెచ్‌వో పెట్టిన నిధులను ఇతర సంస్థలకు మళ్లిస్తామని కూడా ట్రంప్ తెలిపారు.

Recommended Video

US Terminates Relationship with WHO: Donald Trump
 US President Donald Trump terminates relationship with WHO..

వాస్తవానికి డబ్ల్యూహెచ్‌వోకు తాము ఏడాదికి 450 మిలియన్ డాలర్లు అందజేస్తున్నామని.. కానీ చైనా కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తుందని ట్రంప్ గుర్తుచేశారు. అయినా.. చైనా మాటకే డబ్ల్యూహెచ్‌వో విలువనిస్తుందని, చైనా నియంత్రణలో పనిచేస్తుందని ఆరోపించారు. అంతేకాదు కరోనా వైరస్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, సంస్కరణలు అమలు చేయడంలో కూడా డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.

అంతేకాదు అమెరికా పారిశ్రామిక రహస్యాలను దొంగలించేందుకు చైనా గూఢచర్యం నిర్వహించిందని ఆరోపించారు. చైనా నుంచి వచ్చే వారిని అమెరికా రాకుండా నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ దేశ భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.అలాగే హంకాంగ్‌పై చైనా వైఖరి సరికాదని ట్రంప్ అన్నారు.

English summary
US President Donald Trump on Saturday announced that the America is terminating its relationship with the World Health Organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X