వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విష ప్రయోగ భయం: మాంసం మానేసిన ట్రంప్, ఏం తింటున్నాడో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహర అలవాట్లలో మార్పులు చోటు చేసుకొన్నాయి. అధిక బరువును తగ్గించుకోవాలని ట్రంప్‌కు ఇటీవల వైద్యులు సూచించారు. దీంతో ఆహరపు అలవాట్లను కూడ మార్చుకొన్నాడు.మరో వైపు గొడ్డు మాంసం తినడాన్ని కూడ ట్రంప్ మానేశారు. అయితే విష ప్రయోగం చేస్తారనే అనుమానంతో ట్రంప్ గొడ్డు మాంసం తినడాన్ని నిలిపివేశారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ప్రతి ఏటా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ట్రంప్‌ ఆరోగ్యం బాగుందని నివేదిక ఇచ్చారు. అయితే ట్రంప్ ఒబేసీటితో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. ఒబేసిటిని కంట్రోల్ చేసుకోవాలని వైద్యులు ట్రంప్‌కు సూచించారు.

ఒబేసీటిని కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.దీంతో ఆహర అలవాట్లలో ట్రంప్ మార్పులు చేసుకొన్నారు.

ఫిట్‌నెస్‌పై కేంద్రీకరించిన ట్రంప్

ఫిట్‌నెస్‌పై కేంద్రీకరించిన ట్రంప్

ఫిట్‌నెస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేంద్రీకరించాడు. , 71 ఏళ్ల వయసున్న ట్రంప్‌ 108.4 కేజీల బరువున్నారు. ట్రంప్ 6అడుగుల 3 అంగుళాల ఎత్తు,. ఓబేసిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరించారు. దీంతో ట్రంప్ ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించారు. రెండు వారాలుగా ట్రంప్‌ గొడ్డుమాంసం తినడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఫిష్‌ శాండ్‌విచ్‌ (ఫిష్‌ ఓ ఫిలెట్‌), ఫ్రూట్‌ సలాడ్స్‌, చాక్లెట్‌ మిల్క్‌ షేక్‌లను మాత్రమే తీసుకుంటున్నారు.

విష ప్రయోగం చేస్తారనే భయం

విష ప్రయోగం చేస్తారనే భయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గొడ్డు మాంసం తినడం పూర్తిగా మానేశాడు. అయితే దీని వెనుక విష ప్రయోగం చేస్తారనే అనుమానం కూడ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ' పుస్తకంలో ట్రంప్‌ గురించిన అనేక రహస్య విషయాలను ప్రఖ్యాత జర్నలిస్ట్ మిచెల్ పూల్స్ ప్రస్తావించారు.మిచెల్ పూల్స్ రాసిన ఈ పుస్తకంలో రాసిన అంశాలను వైట్ హౌజ్ తీవ్రంగా ఖండించింది. ఈ పుస్తకంలో అవాస్తవాలను ప్రచారం చేశారని పేర్కొంది.

ట్రంప్ బయట ఆహరం ఎందుకు తీసుకోడంటే

ట్రంప్ బయట ఆహరం ఎందుకు తీసుకోడంటే

అతికొద్ది కాలంలోనే తన రియల్ ఏస్టేట్ వ్యాపారాన్ని ట్రంప్ సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. శత్రువుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండే ట్రంప్‌.. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.ఇతర ప్రదేశాల పర్యటనకు వెళ్ళిన సమయంలో ట్రంప్ ఆహరాన్ని ముట్టుకోరు. అయితే మెక్‌డొనాల్డ్స్‌ నుండి తెప్పించే బిగ్‌ మాక్‌ను మాత్రమే తీసుకొంటాడు. ఎన్నికల ప్రచార సమయంలో కూడ ట్రంప్ మెక్‌డొనాల్డ్స్‌ బిగ్ మాక్‌ను మాత్రమే తీసుకొనేవాడు.

ఇష్టమైన పుడ్‌కు దూరంగా

ఇష్టమైన పుడ్‌కు దూరంగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గొడ్డు మాంసం తినడమంటే చాలా ఇష్టం. కానీ, ఫిట్‌నెస్ కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆహరపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఫిట్‌గా ఉండేందుకు డైటీషీయన్ల సూచనల మేరకు ట్రంప్ తన ఆహరపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకొన్నారు.. ఈ మేరకు తకు ఇష్టమైన పుడ్‌కు దూరమయ్యారు ట్రంప్.

English summary
United States President Donald Trump has cut down on red meat, since his doctor told him he needs to lose a few pounds.President Trump has cut out his favorite Big Macs from McDonald's and has been eating more fish, salads and soups. It's been two weeks since Trump ate a hamburger, according to Newsweek.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X