వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోసారి ముచ్చటగా అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్రమోడీతోపాటు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో సమావేశం అవుతానని అమేరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు కూడ తగ్గయాని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల అధినేతలతో సమావేశం కానున్నట్టు ఆయన మరోసారి ప్రకటించారు. సమావేశంలో భాగంగా మరోసారి కశ్మీర్ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోడీ ,ఇమ్రాన్ ఖాన్‌లతో భేటి కానున్న ట్రంప్

మోడీ ,ఇమ్రాన్ ఖాన్‌లతో భేటి కానున్న ట్రంప్

కశ్మీర్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్తితులు నేపథ్యంలోనే అమేరికా అధ్యక్షుడు మరోసారి ఇరుదేశాల ప్రధానులతో సమావేశం అవుతానని ప్రకటించారు. ఓవైపు కశ్మీర్ భారత్ అంతర్గత అంశమని వాదిస్తున్న నేపథ్యంలోనే ప్రధాని మోడి, అమేరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య భేటి ఉత్కంఠను రేపుతోంది. ఈనేపథ్యంలోనే ఈనెల 21 నుండి 27 వరకు పలు కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని మోడీ అమేరికాలో పర్యటించనున్నారు.సెప్టెంబర్ 22న హ్యూస్టన్‌లో భారతీయ అమేరికన్లు నిర్వహించనున్న హౌదీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు ఒకే వేదికమీదకు రానునున్నారు.

యూన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మోడీ,ఇమ్రాన్ ఖాన్

యూన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మోడీ,ఇమ్రాన్ ఖాన్

హ్యూస్టన్ కార్యక్రమం యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోడీతో పాటు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లు కూడ హజరై ప్రసగించనున్నారు. ఈనేపథ్యంలోనే 27న ప్రధాని మోడీతో అమేరికా అధ్యక్షుడు ట్రంప్ భేటి కానున్నారు. 28వ తేదిన పాకిస్తాన్ ప్రధానితో భేటి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమేరికా సహయం కోసం పాకిస్తాన్ వెంపర్లాడుతోంది. కాని భారత్ మాత్రం కశ్మీర్ అంతర్గత అంశమని నొక్కి చెబుతోంది. ఈ సంవత్సరంలో మూడోసారి మోడీ,ట్రంప్‌ల భేటి జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎలాంటీ ప్రకటనలు చేస్తారో వేచి చూడాలి.

ట్రంప్ ఈసారి ఏం చెబుతారో..

ట్రంప్ ఈసారి ఏం చెబుతారో..

దీంతో పాటు కశ్మీర్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందు ఇరు దేశాలు సంయమనం పాటించాలని ట్రంప్ సూచించారు.అంతకు ముందు పాకిస్తాన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. కయ్యానికి కాలు దువ్వితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. భారత్‌తో సర్దుకుపోవాలని హితవు పలికారు. మరోవైపు అంతర్జాతీయంగా కనీసం బంగ్లాదేశ్ కూడ పాకిస్తాన్‌ను మద్దతు ఇవ్వని పరిస్థితి ఉన్న సంధర్భంలో అమేరికా మద్దతు కోసం పాకిస్తాన్ వెంపర్లాడుతోంది. కశ్మీర్ మధ్య వర్తిత్వానికి సిద్దంగా భారత్ మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తోంది. కాని అమేరికా మాత్రం తన ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది.మరి భారత ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
US President Donald Trump will be meeting Prime Minister Narendra Modi and Pakistan premier Imran Khan shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X