వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ఖరారు... భారీగా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

Recommended Video

US President Donald Trump To Visit India On Feb 24-25 || Oneindia Telugu

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఫిబ్రవరి 24 మరియు ఫిబ్రవరి 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారు. రెండురోజుల పర్యటనల్లో భాగంగా ట్రంప్ న్యూఢిల్లీ అహ్మదాబాద్‌లలో పర్యటించనున్నారు. గతవారం అధ్యక్షుడు ట్రంప్ మరియు భారత ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడుకున్నారని ట్రంప్ భారత్‌లో పర్యటించడం ద్వారా ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఇరు నేతలు అభిప్రాయపడినట్లు వైట్‌ హౌజ్ ప్రెస్ సెక్రటరీ స్టెఫనీ గ్రీషం చెప్పారు.

 హౌడీ మోడీ తరహాలో ప్లాన్ చేస్తున్న భారత సర్కార్

హౌడీ మోడీ తరహాలో ప్లాన్ చేస్తున్న భారత సర్కార్


గుజరాత్‌లో అహ్మదాబాద్‌కు ట్రంప్ వెళ్లనున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జీవితంలో అహ్మదాబాద్ కీలకంగా వ్యవహరించిదని అంతేకాకుండా భారత స్వాతంత్ర్య సమయంలో ఈ నగరం నాయకత్వం వహించిందని వైట్‌ హౌజ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఇరు నేతలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. గతేడాది హూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అంతేకాదు ట్రంప్ విజయానికి భారతీయులు సహకరించాలంటూ ప్రధాని మోడీ పరోక్షంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే భారత్‌లో కూడా ట్రంప్ గౌరవార్థం ఓ బహిరంగ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఒబామా పర్యటించిన సమయంలో కంటే ఈ కార్యక్రమం మరింత ఘనంగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం

పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం

ఇక ఈ ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నకలు ఉన్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో వాణిజ్యం, డిఫెన్స్ రంగాల్లో ఒప్పందాలు చేసుకుని ఇదే అంశాలను తన క్యాంపెయినింగ్‌లో చెప్పి భారతీయుల ఓట్లను పొందాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీల్ మరియు అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకంను తగ్గించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. వీలైతే మినహాయింపు కూడా ఇవ్వాలని కోరుతోంది.

భారత్‌లో లాక్‌హీడ్ మార్టిన్ ప్లాంట్ ఏర్పాటు..?

భారత్‌లో లాక్‌హీడ్ మార్టిన్ ప్లాంట్ ఏర్పాటు..?

మరోవైపు అమెరికా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు, మంచి మార్కెట్ కల్పించాలని అమెరికా కోరుతోంది. అదే సమయంలో డెయిరీ ప్రాడక్ట్స్‌కు, మెడికల్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. అంతేకాకుండా భారత్‌తో వాణిజ్య లోటుపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. రక్షణరంగంలో కొనుగోళ్లకు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఫైటర్ జెట్లు కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ భారత్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తే ప్రముఖ డిఫెన్స్ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తన ఎఫ్-16 యుద్ధ విమానాల మానుఫాక్చరింగ్ యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్లు సమాచారం.

English summary
Donald Trump and First Lady Melania Trump will make the trip to "strengthen the US-India strategic partnership," the White House statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X