వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అడ్వైజర్లు: ప్రచార వ్యూహకర్తకు అందలం: వైట్‌హౌస్‌లో పాగా వేసే దిశగా బిడెన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయపోరాటం సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జో బిడెన్ అనూహ్య నిర్ణయాలను తీసుకుంటున్నారు. అధికార యంత్రంగం, సలహదారుల వ్యవస్థను ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేస్తోన్న ఆరోపణలు, ఆందోళనలను ఆయన ఏ మాత్రం పట్టించుకుంటున్నట్లు కనిపించట్లేదు. వీలైనంత త్వరగా అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో అడుగు మోపడానికి చర్యలు తీసుకుంటున్నారు.

అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూ అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూ

ఇందులో భాగంగా కొత్త సలహదారులను నియమించారు. వారంతా వైట్‌హౌస్‌ అడ్వైజర్లుగా పనిచేస్తారని జో బిడెన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తన ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన జెన్ ఓ మ్యాలీ డిల్లాన్‌ను వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. ఆమె సుదీర్ఘ కాలంగా బిడెన్ వద్ద సలహాదారుగా పనిచేస్తున్నారు. లూసియానా క్యాంపెయిన్ రెప్రజెంటేటివ్ సెడ్రిక్ రిచ్‌మండ్‌కు సలహాదారు పదవిని అప్పగించారు.

US President-elect Joe Biden filling top White House team with campaign veterans

Recommended Video

GHMC Elections : Jana Sena, BJP కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలే | Dubbaka ఫలితమే జీహెచ్ఎంసీలోనూ !

స్టీవ్ రిచ్చెట్టినీ సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు జో బిడెన్ కార్యాలయం ఈ ప్రకటనలో వెల్లడించింది. బిడెన్ ఎన్నికల క్యాంప్‌లో డిప్యూటీ మేనేజర్లుగా పనిచేసిన డానా రెమ్యుస్, జూలీ ఛావెజ్ రోడ్రిగ్జ్‌‌లకు వైట్‌హౌస్ సలహాాదారు పదవి దక్కింది. రోడ్రిగ్జ్‌ వైట్‌హౌస్ ఇంటర్-గవర్నమెంటల్ ఎఫైర్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బిడెన్ ట్రావెలింగ్ చీఫ్ ఆప్ స్టాఫ్ అన్నే టొమాసినికి వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్‌ బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఎన్నికల క్యాంప్ సీనియర్ అడ్వైజర్లు ఆంథొని బెర్నాల్, జిల్ బిడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో ఉరుగ్వే రాయబారిగా పనిచేసిన జులిస్సా ప్యాంటాలియోన్‌ను కూడా అడ్వైజర్లుగా నియమించారు.

English summary
US President-elect Joe Biden announced a raft of top White House staff positions on Tuesday, drawing from the senior ranks of his campaign and some of his closest confidants to fill out an increasingly diverse White House leadership team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X