వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బిడెన్ టీమ్‌లో కన్నడిగుడికి కీలక పదవి: ఫస్ట్ టైమ్ ఆ టాప్ పోస్ట్‌లో ప్రవాస భారతీయుడు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో మరో ప్రవాస భారతీయుడికి అత్యంత కీలక పదవి లభించింది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్న జో బిడెన్ టీమ్‌లో ప్రవాస భారతీయుడు డాక్టర్ వివేక్ మూర్తిని తీసుకున్నారు. ఆయన యూఎస్ సర్జన్ జనరల్‌గా నియమితులు కాబోతోన్నారు. అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి నియామకాన్ని జో బిడెన్ క్యాంప్ ధృవీకరించింది. కొత్తగాజో బిడెన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు.

వివేక్ మూర్తి పూర్వీకులు కర్ణాటకకు చెందిన వారు. ఆయనను ఇప్పటికే కోవిడ్-19 సలహదారుగా, టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా- మరో కీలక పదవిని అప్పగించారు బిడెన్. సర్జన్ జనరల్‌గా నియమిస్తామని వెల్లడించారు. ఇదివరకు వివేక్ మూర్తిని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద కూడా పనిచేశారు. 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో సర్జన్ జనరల్‌గా నియమితులు అయ్యారు. బరాక్ ఒబామా హయంలో 5,145 ఓట్లతో వివేక్ మూర్తి నియామకాన్ని అప్పటి సెనెట్ ఆమోదించింది. అప్పటి ఉపాధ్యక్షుడు జో బిడెన్.. స్వయంగా వివేక్ మూర్తికి సర్జన్ జనరల్‌ బ్యాడ్జ్‌ను తగిలించారు.

US President-elect Joe Biden has declared Dr Vivek Murthy as the next Surgeon General

2017 ఏప్రిల్ 21వ తేదీ వరకు ఆయన కొనసాగారు. అనంతరం రాజీనామా చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ఈ పదవి వరించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రజా వైద్య విభాగానికి సంబంధించినంత వరకు అత్యుత్తమ పోస్ట్ ఇది. డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరుడిగా వివేక్ మూర్తికి గుర్తింపు ఉంది. డెమొక్రాట్ల తరఫున ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జో బిడెన్ ఎన్నికల క్యాంపెయిన్ టీమ్‌లోనూ కొన్నాళ్ల పాటు పనిచేశారు.

100 రోజుల్లోనే కరోనాకు బ్రేక్: బిడెన్ యాక్షన్ ప్లాన్‌ ఇదీ: ప్రమాణ స్వీకారం నాటి నుంచే అమలు100 రోజుల్లోనే కరోనాకు బ్రేక్: బిడెన్ యాక్షన్ ప్లాన్‌ ఇదీ: ప్రమాణ స్వీకారం నాటి నుంచే అమలు

English summary
US President-elect Joe Biden has tapped his key COVID-19 advisor Dr Vivek Murthy as the next Surgeon General, a role for which he was appointed during the Obama administration and had to leave abruptly during the current Trump administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X