• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..

|

భారతీయ మూలాలున్న కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్.. డెమోక్రాట్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారన్న ప్రకటన అమెరికా ఎన్నికల్లో మరింత వేడి పుట్టించింది. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తన రన్నింగ్ మేట్ గా కమలను ఎంపిక చేసుకోవడం సంచలనంగా మారింది. దేశంలో జాత్యహంకారం జడలువిప్పిన వేళ ఆఫ్రియా-ఆసియా మూలాలున్న కమల బరిలోకి దిగడం ప్రత్యర్థులకు పెను సవాలు విసిరినట్లయింది. ఆ షాక్ లోనే రిపబ్లికన్ నేత, ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలకు దిగారు. కమలను ఉద్దేశించి ట్రంప్ మరోసారి కంపు వ్యాఖ్యలు చేశారు.

  Trump Called Kamala Harris As Most Horrible Senator నకిలీ నాయకురాలు అంటూ వీడియో ! || Oneindia Telugu

  రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - 'స్పుత్నిక్-వి' కోలాహలం

  అత్యంత దిక్కుమాలిన సెనేటర్..

  అత్యంత దిక్కుమాలిన సెనేటర్..

  ‘‘ఇప్పటిదాకా నా జీవితంలో నేను చూసినవాళ్లలో అత్యంత దిక్కుమాలిన సెనేటర్ ఎవరైనా ఉన్నారంటే, అది కమలా హ్యారిసే. రేసిస్టు విధానాలను బాహాటంగా సమర్థించే ఆమె.. అమెరికాలో ఉన్న నకిలీ నాయకురాళ్ల జాబితాలో ముందుంటారు. డెమోక్రటిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన పోటీలో ఆమె ఎవరినీ ఆకట్టుకోలేకపోయారు. పార్టీలో తనకు పోటీగా నిలిచిన జోబిడెన్ ను కమలా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. అలాంటామెనే మళ్లీ బిడెన్ తన వీపీగా ఎంచుకోవడం నాకైతే షాకింగ్ గా అనిపించింది'' అని ట్రంప్ అన్నారు. వైట్ హౌజ్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

  బిడెన్ పై జాలి.. కమలపై ఆగ్రహం..

  బిడెన్ పై జాలి.. కమలపై ఆగ్రహం..

  కమల అభ్యర్థిత్వం ఖరారైన కొద్ది సేపటికే ఆమెను ఫోనీ(నకిలీ నాయకురాలు) అంటూ ఓ వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. లెఫ్ట్ ఐడియాలజీతో కమల ఎన్నికల బరిలోకి దిగారని, ఆమె ప్రతిపాదించిన పథకాలన్నీ అర్థంలేనివేనని, జనంపై భారీ ఎత్తున పన్నులు విధిస్తానని చెప్పారని, రేసిస్టు చట్టాలపైనా అనూహ్య వ్యాఖ్యలు చేశారని సదరు వీడియో ట్రంప్ పేర్కొన్నారు. కమలా హ్యారిస్ మాత్రమే ఫోనీ(నకిలీ) లీడర్ అని, జోబిడెన్ వట్టి అమాయకుడని, వీపీగా ర్యాడికల్ లెఫ్ట్ కమలను ఎంచుకోవడం ద్వరా పగ్గాలన్నీ ఆమె చేతికే అప్పగించేందుకు బిడెన్ సిద్ధమయ్యారని, నెమ్మదస్తుడైన బిడెన్ - నకిలీ కమల జోడి డెమోక్రాట్లకు బాగుంటుందేమోగానీ, అమెరికాకు మాత్రం హాని చేస్తుందంటూ వీడియోలో ట్రంప్ విరుచుకుపడ్డారు. పార్టీ తరఫున అధ్యక్ష రేసులో బిడెన్ తో తలపడ్డ కమల ఆ తర్వాత పోటీ నుంచి విరమించుకోవడం తెలిసిందే.

  వైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలు

  అమెరికా చరిత్రలోనే తొలిసారి..

  అమెరికా చరిత్రలోనే తొలిసారి..

  అమెరికా ఎన్నికల్లో ప్రతిష్టాత్మక ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతోన్న మొట్టమొదటి ఆఫ్రికన్-అమెరికన్ కమలా హ్యారిస్. ఇప్పటిదాకా కేవంల రెండు సార్లు (1984లో డెమోక్రాట్ గెరాల్డైన్ ఫఎరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్) మాత్రమే ఉపాధ్యక్ష పదవికి మహిళలు పోటీపడ్డారు. సౌత్ ఏషియా మూలాలతో సెనేటర్ గా ఎన్నికైన తొలి మహిళగా, ఆసియా-ఆఫ్రికా మూలాలలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా, శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తిగానూ కమల రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్ గా ఉన్న ఆమెను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ మంగళవారం వెల్లడించారు. బిడెన్ అలా కమల పేరు చెప్పారో లేదో, ట్రంప్ తన నోటికి, చేతికి పని చెప్పారు.

  అమెరికా ఎన్నికల్లో ప్రధానాంశం?

  అమెరికా ఎన్నికల్లో ప్రధానాంశం?

  ఇద్దరూ ప్రత్యర్థులే అయినప్పటికీ.. జోబిడెన్ పై సాఫ్ట్ కామెంట్లు.. కమలా హ్యారిస్ పై మాత్రం తీవ్రవ్యాఖ్యలు చేస్తోన్న ట్రంప్ తీరు జాత్యహంకారానికి మచ్చుతునకేనని పరిశీలకులు అంటున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్' ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటం, నిరసనల విషయంలో దేశం నిలువునా చీలడం, ఆఫ్రికా-ఆసియా మూలాలున్న కమల ఉపాధ్యక్షబరిలోకి నిలబడటం తదితర పరిణామాలన్నీ 2020 ఎన్నికల్లో రేసిజమే ప్రధానాంశమనే సంకేతాలిస్తున్నవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండు పార్టీల ఉపాధ్యక్షులు ఖరారైన నేపథ్యంలో.. అక్టోబరు 7న ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో మైక్ పెన్స్‌తో కమలా హ్యారిస్ డిబేట్‌కు దిగబోతున్నారు.

  English summary
  President Donald Trump on Tuesday called Kamala Harris the "most horrible" member of the US Senate and said he was "surprised" Joe Biden had picked her as his vice presidential candidate. Trump told reporters at the White House that Harris did not impress him when she was vying for the Democratic nomination in primaries eventually won by Biden.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X