వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 రోజుల ఛాలెంజ్: మహమ్మారి నిర్మూలనకు బిడెన్ చెప్పిన చిట్కా: కొత్త టాస్క్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి అధ్యక్షుడు జో బిడెన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వందరోజుల పాటు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నన్ని రోజులు మాస్కులను ధరించనక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు. వంద రోజులు మాత్రమే వాటిని ధరించాల్సి ఉంటుందని సూచించారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

Recommended Video

TOP NEWS OF THE DAY : US Congress In Turmoil As Violent Trump Supporters Breach Building

రివర్స్‌లో పాలన: దాని నిర్మాణానికి బ్రేక్: నిధుల్లేవ్: కీలక ఉత్తర్వుల జారీలో బిజీగా బిడెన్ రివర్స్‌లో పాలన: దాని నిర్మాణానికి బ్రేక్: నిధుల్లేవ్: కీలక ఉత్తర్వుల జారీలో బిజీగా బిడెన్

మాస్కులను ధరించడం దేశభక్తితో సమానమని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికన్లకు దేశం పట్ల ఉన్న భక్తిని చాటుకోవడానికి ఇదొక మంచి అవకాశమని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని చెప్పారు. జీవితకాలం పాటు మాస్కులను ధరించాలని తాను చెప్పట్లేదని, వంద రోజులు చాలని వివరించారు. వంద రోజుల పాటు ప్రతి అమెరికన్ కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించడం వల్ల రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గిపోతాయని జో బిడెన్ పేర్కొన్నారు.

US President Joe Biden asking every American to mask up for the next 100 days

ఈ చిట్కాను పాటించడం వల్ల ప్రతి అమెరికన్ కనీసం 50 వేల ప్రాణాలను కాపాడవచ్చని బిడెన్ అన్నారు. మాస్కులను ధరించడం వల్ల కరోనా నియంత్రణలోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారని, అందుకే ఈ నిబంధనను అమల్లోకి తీసుకుని రావాల్సి వచ్చిందని అన్నారు. ఏప్రిల్ వరకు మాస్కులను దరించడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందో.. కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో ఎలాంటి క్షీణత కనిపిస్తుందో అందరకీ అర్థమౌతుందని అన్నారు.

నిజానికి- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జో బిడెన్ జారీ చేసిన 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇదీ ఒకటి. వంద రోజుల పాటు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేయడానికి ఉద్దేశించిన ఆర్డర్‌పై ఆయన తొలి రోజే సంతకం చేశారు. దీనిపై ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించట్లేదు. దీనితో ఆయన మరోసారి అమెరికన్లకు మాస్కుల ధారణ ప్రాధాన్యతను వివరించారు. ఏప్రిల్ వరకు ధరిస్తే చాలని సూచించారు.

English summary
US President Joe Biden told that the experts say that by wearing masks from now till April, we can save more than 50,000 lives. So I am asking every American to mask up for the next 100 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X