వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత విమాన ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన అమెరికా: ఈ తేదీ నుంచే: కొత్త గైడ్‌లైన్స్ ఇవే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోలాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రాలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

చాలాదేశాలు రీఓపెన్..

చాలాదేశాలు రీఓపెన్..

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించాయి. పలు దేశాలు ఇప్పటికే తమ ఆంక్షలను సడలించుకున్నాయి. పరిమితంగా విమాన సర్వీసులను పునరుద్ధరించాయి. ఇదివరకు విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి అనుమతి ఇస్తోన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరించాయి.

ఆంక్షలను ఎత్తేసిన అమెరికా..

ఆంక్షలను ఎత్తేసిన అమెరికా..

అయిదు నెలల పాటు ఈ నిషేధాన్ని కొనసాగించింది. ఏప్రిల్‌లో విధించిన ఈ నిషేధం అయిదు నెలల పాటు కొనసాగింది. ఇక తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా భారత విమాన ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దాని స్థానంలో కొత్తగా కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలను అమలులోకి తీసుకుని రానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. భారత్, చైనా సహా మొత్తం 33 దేశాలపై విధించిన కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా.

గైడ్‌లైన్స్ ఆర్డర్‌ జారీ..

గైడ్‌లైన్స్ ఆర్డర్‌ జారీ..

కొత్తగా రూపొందించిన గైడ్‌లైన్స్‌పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారని ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలను విదేశీ పౌరులకు మాత్రమే కాకుండా.. ఆయా దేశాల్లో నివసిస్తోన్న తమ సొంత ప్రజలకు కూడా వర్తింపజేసింది అమెరికా. నవంబర్ 8వ తేదీ తరువాత తమ స్వదేశానికి వచ్చే అమెరికన్లు మూడురోజుల కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టయితేనే..

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టయితేనే..

భారత్, చైనా ఇతర 33 దేశాలకు చెందిన పౌరులు.. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. అలాగే మూడురోజుల పాటు చెల్లుబాటయ్యేలా కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారికి తమ దేశానికి రావడానికి అనుమతి ఉండదని అమెరికా స్పష్టం చేసింది. జనాభాలో 10 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్న దేశాలకు చెందిన ప్రజలపై కొన్ని కొత్తగా విధించింది యూఎస్. అలాంటి దేశాలకు చెందిన పౌరులు.. అమెరికాకు రావడానికి గల కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. అది సంతృప్తికరంగా ఉంటేనే అనుమతి లభిస్తుంది.

మినహాయింపు వీరికే..

మినహాయింపు వీరికే..

ఈ క్రమంలో కొన్ని వర్గాల వారికి మినహాయింపును ఇచ్చింది అమెరికా. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. వారు ఎలాంటి కారణాన్ని చూపించకుండా అమెరికాలో అడుగు పెట్టొచ్చు. తమ వయస్సు 18 సంవత్సరాల లోపే అని తెలియజేసే ధృవీకరణ పత్రాన్ని అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా మినహాయింపు కేటగిరీలోకి చేర్చింది.

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand
అమెరికాలో కరోనా తీవ్రత..

అమెరికాలో కరోనా తీవ్రత..

వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని భావించే వారికి మినహాయింపు ఉంది. తాము విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటిదాకా 4,64,15,468 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. కొత్తగా 24 గంటల్లో కొత్తగా 47,861 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 7,57,824కు చేరింది. 24 గంటల్లో 501 మంది కరోనా బారిన పడి మరణించారు.

English summary
US President Joe Biden signed an order imposing new vaccine requirements and lifting severe travel restrictions on China, India and much of Europe effective November 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X