'ఇనాగరేషన్ డే'గా పిలుచుకునే అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(జనవరి 20న) నాడు ప్రమాణం చేశారు. అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా ఇదే రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు
ఇనాగరేషన్ డే-2021 కార్యక్రమానికి ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20న(బుధవారం) రాత్రి 10.00 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత అమెరికా జాతీయగీతాన్ని ఆలపించారు. యూఎస్ కొత్త ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(జోబైడెన్ భార్య) ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగించారు. ఇక జో బైడెన్ ప్రమాణస్వీకారంకు సంబంధించి మినిట్-టూ- మినిట్ అప్డేట్స్ లైవ్‌లో మీకోసం...
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్విటర్ ప్రొఫైల్ మార్చిన కమలా హ్యారిస్. ప్రజలకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తొలి ట్వీట్
10:47 PM, 20 Jan
Congratulations & best wishes to Joe Biden & Kamala Harris on being sworn in as President & Vice President of USA. India-US ties are based on many shared values & I'm sure that partnership between the two nations will get further cemented in coming years: VP M Venkaiah Naidu pic.twitter.com/xxb2hCIKor
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు శుభాబినందనలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
10:46 PM, 20 Jan
ప్రపంచ దేశాలతో మరోసారి మాట్లాడతాను: జో బైడెన్
10:45 PM, 20 Jan
I know forces that divide us are deep & they are real. But I also know they are not new. Our history has been a constant struggle between American ideal that we're all created equal & harsh ugly reality that racism, nativism,fear, demonization have long torn us apart:US President pic.twitter.com/PtVKj2gXQ0
మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్న శక్తులు ఎప్పుడూ ఉంటాయి.ఇవి అమెరికాకు కొత్త కాదు.వీటిని ఎదుర్కొని ఎన్నో సార్లు విజయం సాధించాం: జో బైడెన్
10:43 PM, 20 Jan
శాంతి కోరుకునే దేశాలతో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ముందుటాను: జో బైడెన్
10:42 PM, 20 Jan
అమెరికా ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాను: జో బైడెన్
10:42 PM, 20 Jan
Today, on this January day, my whole soul is in this: bringing America together, uniting our people, uniting our nation: US President Joe Biden pic.twitter.com/s3hdP5QjR6
జో బైడెన్ ఐకమత్యంతో ఎలా ఉండాలో నేర్పుతారు: జో బైడెన్
10:39 PM, 20 Jan
కరోనావైరస్ కారణంగా 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికి నివాళులు అర్పించిన జో బైడెన్
10:38 PM, 20 Jan
సరిహద్దు దేశాలతో ఉన్న బేదాభిప్రాయాలకు మరమత్తులు చేస్తాం: జో బైడెన్
10:37 PM, 20 Jan
ఒక్క దేశంగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని విజయం సాదిద్దాం: జో బైడెన్
10:37 PM, 20 Jan
అమెరికాలో ఈ రోజు ప్రజాస్వామ్య దినోత్సవం: జో బైడెన్
10:36 PM, 20 Jan
అన్ని సవాళ్లకు సమస్యలకు పరిష్కారం కనుగొంటాం: జో బైడెన్
10:36 PM, 20 Jan
My warmest congratulations to Joe Biden on his assumption of office as President of the United States of America. I look forward to working with him to strengthen India-US strategic partnership: Prime Minister Narendra Modi https://t.co/DIzdGZKjj9pic.twitter.com/50oA0r0Dl3
ఈ అద్భుతమైన ఘట్టంలో తనపక్కన తన భార్య లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ జో బిడెన్ భావోద్వేగ ట్వీట్.
10:07 PM, 20 Jan
అమెరికా జాతీయగీతంను ఆలపించిన ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా
10:01 PM, 20 Jan
ప్రార్థనతో ప్రారంభమైన జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం
9:55 PM, 20 Jan
Tamil Nadu: Locals light diyas in Thulasendrapuram, the native village of the mother of US Vice President-elect Kamala Harris ahead of her swearing-in. pic.twitter.com/b89WEstmb1
కమలా హ్యారిస్ సొంత గ్రామం తులసేంద్రపురంలో పండగ వాతావరణం
READ MORE
11:28 AM, 20 Jan
భారత కాలమాన ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం
11:29 AM, 20 Jan
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్
11:30 AM, 20 Jan
అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ప్రమాణస్వీకారం. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా
11:36 AM, 20 Jan
దేశాధ్యక్షుడినైనా ఎప్పటికీ డెలవావేర్ పౌరుడినే: ప్రమాణస్వీకార కార్యక్రమంకు బయలుదేరే ముందు జో బైడెన్ ఉద్వేగభరితమైన ప్రసంగం
1:40 PM, 20 Jan
జోబిడెన్ ప్రసంగం రూపొందించింది మన తెలంగాణ వ్యక్తి వినయ్ రెడ్డి
1:53 PM, 20 Jan
కమలా హ్యారిస్ సొంతగ్రామం తమిళనాడులోని తులసేంద్రపురంలో సంబురాలు. తమ గ్రామంకు చెందిన మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం తమకెంతో గర్వంగా ఉందని చెబుతున్న గ్రామస్తులు
3:21 PM, 20 Jan
అమెరికా క్యాపిటల్ హిల్ భవనం వద్ద బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికకు తుది మెరుగులు అద్దుతున్న సిబ్బంది
4:20 PM, 20 Jan
బైబిల్ చేతపట్టుకుని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్
4:53 PM, 20 Jan
అమెరికాలో ముస్లింల ప్రవేశంపై నిషేధం విధించిన ట్రంప్ నిర్ణయాన్ని తొలి రోజు రద్దు చేయనున్న బైడెన్
5:03 PM, 20 Jan
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిరోజున రద్దయిన పారిస్ వాతావరణ ఒప్పందంను తిరిగి అమలు చేసేందుకు బైడెన్ నిర్ణయం
5:34 PM, 20 Jan
ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి పెంచనున్న బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు కాబోయే అమెరికా రక్షణ మంత్రి లూయిస్ అస్టిన్ స్పష్టం చేశారు.
6:37 PM, 20 Jan
బైడెన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపిన బిట్రన్ ప్రధాని బోరిస్ జాన్సన్
6:38 PM, 20 Jan
బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ నిర్ణయాలకు బ్రేక్ వేయాలని భావిస్తోన్న జో బైడెన్
6:45 PM, 20 Jan
మరికొద్ది సమయంలో జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైట్‌హౌజ్ నుంచి ప్రత్యేక చాపర్‌లో బయలుదేరిన ట్రంప్,మెలానియా ట్రంప్
6:48 PM, 20 Jan
#WATCH Donald Trump departs from the White House as the president for the last time, ahead of the inauguration of president-elect Joe Biden in Washington#USApic.twitter.com/xS8eirurtf
మెరైన్ వన్‌లో వైట్‌హౌజ్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లిన ట్రంప్ దంపతులు
7:04 PM, 20 Jan
ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ట్రంప్. అక్కడే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్
7:06 PM, 20 Jan
This has been an incredible four years. We accomplished so much together. I want to thank my family, friends and my staff. Want to thank you for your effort. People have no idea how hard this family worked: Donald Trump, outgoing US President, at Joint Air Force Base Andrews pic.twitter.com/MMF0U8bhM8
మీరు చూపిన ఆదరాభిమానులకు నా తరపున నా కుటుంబం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను: ట్రంప్
7:07 PM, 20 Jan
ప్రథమ మహిళగా సేవ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భగవంతుడు అమెరికాను ఆశీర్వదించాలని కోరుతున్నాను: మెలానియా ట్రంప్
7:09 PM, 20 Jan
కరోనావైరస్తో చాలామంది మృతి చెందారు. వైరస్‌తో ప్రపంచమంతా కుదేలయ్యింది. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి: ట్రంప్
7:10 PM, 20 Jan
అమెరికా ప్రపంచదేశాల్లోకెల్లా అగ్రరాజ్యంగా నిలిచింది. ప్రపంచ ఆర్థికశక్తిగా అమెరికా నిలిచింది. గత నాలుగేళ్లలో అమెరికా చరిత్రలో నిలిచిపోతుంది: ట్రంప్
7:11 PM, 20 Jan
మేము అమెరికా అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొన్నాం.మీరు వేసిన ఓట్లకు ధన్యవాదాలు:ట్రంప్
7:12 PM, 20 Jan
We have the greatest country and economy in the world. We were hit so hard by the pandemic. We did something that is considered a medical miracle- the vaccine which was developed in 9 months: Donald Trump https://t.co/uaSQwzwMLppic.twitter.com/D6OMyqLa3P
రికార్డు సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాం: ట్రంప్
7:13 PM, 20 Jan
అమెరికా దేశం ఎంతో ఘనచరిత్ర ఉన్న దేశం. అమెరికన్లకు తాను అధ్యక్షుడిగా సేవలు అందించడాన్ని ఆస్వాదించాను. అదే సమయంలో గర్వంగా కూడా ఉంది: ట్రంప్
7:14 PM, 20 Jan
చైనా వైరస్‌కు బలైన వారికి నివాళులు అర్పిస్తున్నాం: ట్రంప్
7:15 PM, 20 Jan
I will always fight for you. I will be watching, listening. The future of this country has never been better. I wish the new administration great luck and success. I think they have the foundation to do something really spectacular: US President Donald Trump pic.twitter.com/JXkCGhCAFm